-
-
అంతర్నేత్రం
Antarnetram
Author: Mohana Rao Duriki
Publisher: Self Published on Kinige
Pages: 172Language: Telugu
సంతానంలేని దంపతులు సంతాన సాఫల్య కేంద్రం ద్వారా పిల్లలను కనడం మంచిదే. కానీ కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలలో చీకటి రాజ్యమేలుతోంది. ఆ చీకటి కోణాలను వెలుగులోనికి తేవడమే ఈ చిన్న ప్రయత్నం. దానితోపాటు ' ప్రేమ' అనే లాలీపాప్కు 'సెక్స్ ఎడ్యుకేషన్' అనే షుగర్ కోటింగ్ కూడా జోడించాను. ఇది వినోదంతో పాటు విజ్ఞానంగా పాఠకులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
ఇది రూపాయి బిల్లకు ఒకవైపు. మరోవైపు - సంతాన సాఫల్య కేంద్రం ద్వారా సంతానం పొందిన దంపతుల మనోగతాలను కూడా మరో కోణంలో పరిశోధించాను. దీనిని ఉన్నత భావాలతో అర్థం చేసుకున్న దంపతులు సంతోషంగా ఉన్నారు.
కానీ సంకుచిత భావాల దంపతులు ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటున్నారు? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా వివరించాను. ప్రాణాపాయంలో ఉన్న ఓ స్త్రీ ఓ పురుషుడి రక్తం ఎక్కించుకుంటే తప్పులేదు. కానీ పరాయివాడి రక్తం పంచుకున్నావని ఆమె తండ్రి సంకుచిత బుద్దితో ఆ కూతురిని హింసిస్తే? ఆ హింసను ఎలా భరిస్తుంది? అలాగే తన భర్తతో సంతానం లేని భార్య సంతాన సాఫల్య కేంద్రం ద్వారా సంతానం పొందితే - ఆమె భర్త పొందే సంకుచిత బుద్ధికి ప్రతిరూపమే ఈ 'అంతర్నేత్రం' నవల. చదవండి, వీలుంటే చదివించండి. కృతజ్ఞతతో.
- మోహన రావు దురికి
