• Antarjalamlo Telugu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • అంతర్జాలంలో తెలుగు

  Antarjalamlo Telugu

  Pages: 142
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సెల్‌ఫోన్లలో, అరచేతిలో ఇమిడిపోయే డివైజ్‌లలో ఇంటర్‌నెట్ బ్రౌజ్ చేసే సదుపాయం అందరికీ అందుబాటులోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మంది అంతర్జాలం వాడుతున్నారు. ప్రతి 60 సెకన్లకు 300 మంది కొత్తగా వాడకం మొదలుపెడుతున్నారు. ప్రతి సెకనుకు 10,633 జీబీల సమాచారం కొత్తగా అంతర్జాలంలో చేరుతోంది. ఇలాంటి అంతర్జాలం భవిష్యత్‌లో ప్రతి మనిషికీ ఒక నిత్యావసరం కానుంది.

ఇకపోతే భాషాభివృధ్ధికి సామాజిక వ్యవస్థ సహకారం ఎంత అవసరమో సాంకేతిక వనరులు కూడా అంతే అవసరం. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో సమాచార ఉపగ్రహాలు అందుబాటులోనికి వచ్చిన తర్వాత దూరభారాలతో నిమిత్తం లేకుండా, పరిమితులను తుడిచివేస్తూ ఎంతటి సమాచారమైనా ఇచ్చిపుచ్చుకొనే సదుపాయం ఏర్పడింది. ఆ సమాచారం విద్య, వైద్య, వస్తూత్పత్తి, వ్యాపార రంగాలలో ఏదైనా కావచ్చు. ఈ పని అంతర్జాలం ద్వారా సాధ్యమవుతున్నది. కాబట్టి ఎంతో వేగవంతంగా విస్తరిస్తున్న కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలను వినియోగించుకొని ప్రాంతీయ భాషల్ని అభివృధ్ధి పరచుకోవాలి. తెలుగు భాషను ప్రపంచభాషగా చేయగల శక్తి ఒక సాంకేతిక రంగానికే ఉంది.

Preview download free pdf of this Telugu book is available at Antarjalamlo Telugu
Comment(s) ...

నేడు చాలా పరిశోధనలు వస్తూనే ఉన్నాయ్. ఇలాంటి పరిశోధనలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయ్. ఒకటి కేవలం విశ్లేషణ, రెండు సమాచార గ్రహణం. ఈ రెండిటినీ ఒక చోట చేర్చి ఒక వ్యక్తి అంతర్జాలంలో ఏ అంశాన్ని చూడాలనుకుంటున్నాడో, అతడి అభిరుచిని అనుసరించి ఎక్కువ శోధన అవసరం లేకుండా సమాచారాన్ని అందించడం ఒకటి అంశం. ఈ పుస్తకంలోని వ్యాసాలు చదివిన తర్వాత అంతర్జాలంలో ఇన్ని అంశాలను మనం ఇంకా చూడలేదని, వాటిని చూడాలని అనిపించేలా ఈ వ్యాసాలు చేస్తాయి. ఇతడి శైలి పాఠకుడికి చదివించేలా చేస్తుంది. వాక్యంలో పట్టు - వ్యాకరణం మీద పరిశోధన చేయడం, డిగ్రీవరకు ఓరియంటల్ కళాశాలలో విద్యను అభ్యసించడం, హైదారాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి వద్ద యం.ఫిల్., ను పూర్తి చేయడం మొదలైన అంశాలు కారణాలు. ప్రస్తుతం టెక్నికల్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా వృత్తిని స్వీకరించడంలో అంతర్జాల విద్య అవసరం అయింది. ఆ నేపథ్యమే ఈ పరిశోధనకు బీజం. వెంటనే అంగీకరించి, ఆనందించిన మార్గదర్శకులు ఆచార్య మన్నవ సత్యనారాయణ వారిఆశీస్సు పరిపూర్ణంగా పొందాడు. వెరసి ఏకాదశ వ్యాసాలతో, 142 పుటల అంతర్జాలం చాలా తక్కువ ధరకే పాఠకుడికి అందుబాటులోకి తేవాలనే ప్రయత్నం అందులో భాగం. కష్టించే పని చేయడం, ఇష్టంగా వాక్యాన్ని తయారుచేయడం, పొగడ్తలకు అట్టే పడిపోని వ్యక్తిత్వం, సూటిగా చెప్పే స్వభావం ఇతడి శైలికి శైశవం నుంచి సమర్థవంతంగా తయారు చేశాయి. ప్రతీ వ్యాసాన్ని పరిచయం చేయడం కంటే చదివి శోధన చేయడం అవసరం. ఒక రకంగా చెప్పాలంటే ఈ పుస్తకం ఒక కార్యశాల(work shop). ఇది అంతంకాదు ఆరంభం. ఇంకా ఎన్నో పరిశోధనలు రావాలి. తెలుగును అంతర్జాతీయ స్థాయిలో ఆంగ్లభాషకు దీటుగా వెలగాలి అనే డా. లక్ష్మణ రావు ఆశయం, అందరి తెలుగువాళ్ళ ఆలోచన ఒకటిగా ప్రయోజనం, ప్రయోగ వంతంగా అంతర్జాలవేదిక మీద విశ్వవ్యాప్తం కావాలి.
వివిధ పత్రికల్లో ప్రచురితం అయిన సంపాదక, పాఠక, ఆమోదయోగ్యమైన వాటిని అచ్చువేసిన ఈ పుస్తకం పాఠకుడికి కచ్చితంగా గిట్టుబాటు అవుతుంది. సాంకేతికను గురించి నేర్చుకోవాలన్న కుతూహలం ఉన్న వారందరికి కరదీపికగా, గ్రంథాలయ వీచిక గా ఉపకరిస్తుంది. ఈ పరిశోధనను ప్రాథమికంగా తీసుకుని తెలుగు ఫాంట్స్ (ఖతులు) తయారు చేసే విధానం, రాసి ఉన్న అక్షరాన్ని కంప్యూటర్ గ్రహించే విధానం, అందరికి అందుబాటులో వచ్చేలా, పేజ్ మేకర్ కు అనుకూలంగా ఉండేలా ఫాంట్స్, P D F (తెలుగు)లను సైతం కాపీ చేసేందుకు వీలుగా ఉండే సాంకేతికను తయారు చేయవల్సిన అవసరం ఉంది. అలాగే ఆప్టికల్ కారక్టర్ రికగ్నిషన్( అక్షరాన్ని స్కేన్ కాపీ చేస్తే దాన్ని కంప్యూటర్ గుర్తించడం) లాంటి విషయాలమీద మరింత నిశిత, సాంకేతిక పరిశోధన చేయడం అనే అవసరాన్ని ఈ పుస్తకం గమనింపజేస్తుంది.
మొత్తం మీద ఈ వ్యాసకర్త డా. పి.వి. లక్ష్మణరావుకు అభినందనలు.
-డా.జె. సీతాపతి రావు, తెలుగు ఉపన్యాసకులు