• Antarangam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతరంగం

    Antarangam

    Publisher: Srijana Lokam

    Pages: 340
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులుగారు వివిధ సాహిత్య గ్రంథములకు వ్రాసిన పీఠికల సంకలనము. ఒకవిధంగా ఇది సమకాలీన ఆంధ్రసాహిత్యాన్ని గురించిన వారి సాహిత్య అంతరంగ వివేచన. దాదాపు 60కి పైగా పుస్తకాలకు వ్రాసిన పీఠికలు ఈ గ్రంథంలో చేర్చబడ్డాయి. ప్రవేశిక, ఉద్దీపన, ప్రరోచన, ఆముఖము, భూమిక, సంపాదకీయాది నామాలతో దాదాపు తెలుగు సాహిత్యంలోని అన్ని శాఖలకు సంబంధించిన రచనలకు పీఠికలు ఈ గ్రంథంలో కన్పిస్తాయి.

నిష్పాక్షికమైన గుణదోష విమర్శ, గ్రంథ పరిశోధనలో అంతస్సత్త్వ వ్యాఖ్యానము, సాహిత్య పరిణామాన్ని అంచనా వేయడంలో ప్రమాదమెరుగని ప్రమాణ ప్రతిపాదన, ఇతిహాస కావ్యములను తరచి చూడడంలో సంప్రదాయ దృష్టి దాటిన రహస్య కథన సంప్రదాయము, ప్రతీకల విశ్లేషణ, ఆధునిక రచనలలోని తాత్త్విక, రాజకీయ, జాతీయ దృక్పథము, ఇవన్నీ పీఠికల్లో మనకు కన్పిస్తాయి.

సుప్రసన్నగారి సాహిత్య సూత్రానికి మూడు పోగులు కన్పిస్తాయి. భారతీయ ఆత్మ, జాతీయత, నవ్యత. వారి సృజన విమర్శ సాహిత్యం అంతా ఈ త్రిపుటిలో పెనవేసుకున్నదే.

వడ్డించిన విస్తరిలాంటి ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలోని ప్రక్రియల రుచులను రుచిమంతంగా మీ ముందుంచుతున్నది. పరిశోధకులకు, జిజ్ఞాసువులకు, కవులకు సాహిత్య ప్రస్థానంలో దిక్సూచిగా ఈ పీఠికా సంకలనం నిలుస్తుందని భావిస్తున్నాము.

- డా. వజ్ఝల రంగాచార్యులు

Preview download free pdf of this Telugu book is available at Antarangam