-
-
అంతా రామమయం
Anta Ramamayam
Author: Dr. Kampalle Ravichandran
Publisher: Kantamneni Venkateswararao
Pages: 120Language: Telugu
Description
పాఠకలోకానికి పరిచయం చేయనక్కరలేని రచయిత కంపల్లె రవిచంద్రన్ ప్రతిభ బహుముఖీనం. తెలుగు, తమిళం, సంస్కృత, ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు. అపార అధ్యయన సంపన్నుడు.
నలభై దాటని వయసులో ప్రాచీన, అర్వాచీన గ్రంథాల్ని అమూలాగ్రం అధ్యయనం చేసి వాటి అంతఃసారాన్ని మనకు అందించడం ఆయన రచనాశైలి. పురాణ, కావ్య, ప్రబంధరీతుల్ని అపూర్వంగా విశ్లేషిస్తాడు. తెలుగుభాష అంటే ఆయనకు వ్యామోహం. నన్నయ మొదలు తెలుగుభాష సోయగాలు, వొయ్యారాలు అరటిపండు వొలిచినట్టు మనకు అందిస్తారు.
“సప్తగిరి” మాసపత్రికలో రవిచంద్రన్ ధారావాహికగా రాస్తున్న ‘కైంకర్యమే తనువుదాల్చితే...’ విశేషపాఠకాదరణ పొందుతున్నది. ప్రస్తుతం భద్రాచల రామదాసు కీర్తనలకు భావ వ్యాఖ్యతో రవిచంద్రన్ కలంనుండి వెలువడిన అద్భుత రచన “అంతా రామమయం”.
Preview download free pdf of this Telugu book is available at Anta Ramamayam
Login to add a comment
Subscribe to latest comments
