• Ankuram Kavita Sankalanam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అంకురం - కవితా సంకలనం (free)

    Ankuram Kavita Sankalanam - free

    Author:

    Pages: 95
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉక్కు మనిషి


విలీనం నుంచి విభజన దాకా
వలసవాదం నుంచి బలిదానాల దాకా
అణిచివేత వెతలపై వామనుడి
నాలుగో పాదమే కాళోజీ కైతలగానం


అన్యాయం అంతానికి పంతంపట్టిన
ప్రజాస్వామ్య పావురం
కలియుగ ప్రజల ఆయుధం
ధిక్కారం అతని స్వరం
ప్రజాహితం అతని కలం
కలకాలం నిలిచే కవిత్వం
నిర్మూలించే బానిసత్వం


అతడు ఒలికించినవి
సిరా చుక్కలు కావు
అమృతపు రసగుళికలు
పలికించినవి రసగీతాలు కావు
నోరులేని అభాగ్యుల హృదయ వేదనలు
అన్యాయాన్ని ఎదిరించే
ఆధునిక అక్షరాన్వేషి


అసలం నింపుకున్న
కలం వదిలిన మాటల తూటాలు
త్యాగం నెత్తుటి గాయాల మరకలతో
జీవంపోసుకున్న శాశ్వత శిలాక్షరాలు


దిక్కులు పిక్కటిల్లేలా
జనజాగృతి గీతం
ఆతృతగా ఆలపించిన
ప్రజాకవి కాళోజీ
అతని కవితలు
సెలయేటి రాగాలు
గర్జించే మేఘాలు


అన్యాయాన్ని ఎదిరించి
దళారుల దమననీతిపై
దావానలం కురిపించిన
చిచ్చర పిడుగు
ఉక్కుమనిషి కాళోజీ
ప్రాంతీయుల దోపిడీని
పాతరేసే పాఠాలను బోధించే
భాష యాస అందాన్ని
ఐడిపలుకుల భాష వదిలి
పలుకుబడుల బాటన
నడిచిన భాషోద్యమ మార్గదర్శి

- శీలం భద్రయ్య