• Ankuram
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంకురం

    Ankuram

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 46
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బోధనా నేపథ్యమూ, సామర్థ్యమూ మెండుగా ఉన్న ఉపాధ్యాయినులలో బి.ఇ.డి ఉపాధ్యాయిని శ్రీమతి నంబూరి మనోజ ఒకరు. విద్యార్థులతో, వారికందించే పాఠ్యబోధనలతో అనుదిన సంబంధముండే సజీవ వృత్తి జీవితం ఈమెది. అయితే సిలబస్ ప్రకారం పాఠాలు బోధిస్తూ కాలాన్నీ, వృత్తినీ సాగించుతూ, తృప్తి చెందే టీచరమ్మ మాత్రమే కాదు మనోజ! పాఠ్య బోధనతోనే తన బాధ్యత తీరుతుందనుకునే వ్యక్తి కాదు.

వస్తుతః మనోజ మంచి రచయిత్రి. అభ్యుదయ రచనా రీతి తనకి యిష్టమైన వ్యాసంగం. ఉపాధ్యాయ పత్రిక, యితర వార పత్రికలలో ఈమె రచనలు పలకరిస్తుంటాయి పాఠకులని. మనోజ రచనలు అభ్యుదయ ధోరణికి చెందినవి, శాస్త్రీయ దృక్పథ ప్రధానమైనవి.

బాలబాలికల కోసం వ్రాసిన కథలు - ప్రత్యేకమైనవి, ప్రశంసించదగ్గవి. బాలల నైసర్గిక, స్వచ్చంద ఆలోచనా రీతులని ఇవి ఆహ్లాదకరంగా తెలియబరుస్తున్నాయి. బాలల సహజ ఆలోచనా రీతుల్నీ, ఊహల్నీ, వాటిని వెలువర్చే క్రమాన్ని - కథల రూపంలోనే గాక - బుర్ర కథలుగా కూడా కూర్చి ఆకాశవాణిలో ప్రసారమయ్యేలా చేస్తుంటుంది. బుర్ర కథల ప్రసార క్రియలో బాలలు స్వయంగా పాల్గొని పాత్రలు పోషించడం వల్ల కథా సందేశాన్నీ, సారాన్నీ తామూ, శ్రోతలు సులువుగా గ్రహించేట్టు చేస్తున్నమాట నిజం.

మనోజ వ్రాసిన కథలలో కొన్నింటిని 'అంకురం' శీర్షికన పుస్తకరూపంలోకి తేవడం ముదావహం. ఇవన్నీ చక్కని చిట్టి పొట్టి కథలు. ప్రతీ ఇంటా చిన్న పిల్లలకూ, తల్లిదండ్రులకూ మధ్యన, జతగాళ్ళ మధ్యన అతి మామూలుగా జరుగుతుండే అమాయక ముచ్చట్ల, మాటల రూపాన మలచబడ్డాయి కథలన్నీ.

- నంబూరి పరిపూర్ణ

Preview download free pdf of this Telugu book is available at Ankuram