• Andhrasatavahanula Aswamedhayagamu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఆంధ్రశాతవాహనుల అశ్వమేధయాగము

  Andhrasatavahanula Aswamedhayagamu

  Author:

  Pages: 268
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

ఆంధ్రశాతవాహనుల అశ్వమేధయాగం అనే ఈ నవల క్రీస్తు పూర్వం నూరు నూటయాభయి సంవత్సరాల నాటిది. ఈ నవల ఒక చరిత్ర అనవచ్చు, ఆ కాలం సాంఘిక నవల అనవచ్చు. క్లుప్తంగా ధర్మ అర్ధ కామ మోక్షాలకు ఒక ఆవిష్కరణ అనవచ్చు. ‘ఆంధ్రశాతవాహనులు’ లో ఆంధ్ర అనేది ఆనాడు ఒక భాషకాదు. ఒక జాతి. ఇది నేటి సీమాంధ్ర తెలంగాణకు సంబంధించింది అసలేకాదు. ఈ రాజవంశంవారు నేటి మహారాష్ట్రాలోని పైఠాన్ ( ప్రతిష్ఠానపురం) నుంచి పరిపాలించారు.
ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ నవల ముద్రణకు వెళితే “నవలా రచయితలకు ఇవి గడ్డురోజులండీ. అందరూ TV సీరియల్సు చూస్తున్నారు. నవలలు చదవరు. అందులోను ఆంధ్ర అని కనిపించగానే కొందరు అసలు చదవరు” అన్నారు పబ్లిషర్సు.
ఈ నవలకు ఇతివృత్తం అశ్వమేధయాగం. ఇది పైకి కనిపించేది. అసలైనది ‘యజ్ఞోవై సూనృతాః’ సత్ అనే పరమాత్మను నమ్ముకుని జీవించడమే నిజమైన యజ్ఞం. సత్యహరిశ్ఛంద్రుడు ఇదేపని చేశాడు.
ఈ నవల చదవడం చదవకపోవడం మీ ఇష్టం. చదివిన తరువాత బాగులేదనిపిస్తే అది నా లోపం. ఈ నవలంటే నాకు పిచ్చి ఇష్టం. ఇందులోని సంఘటనలు సంభాషణలు ఇప్పటికీ నెమరువేసుకుంటుంటాను. ఎందుకంటే ఎన్నో శాస్త్రీయ విషయాలు సంభాషణలద్వారా తియ్యగా చెప్పకలిగాను.
ఈ నవలకు రాణి నాగానికాదేవి. ఈ గృహతపస్వి చరితం వ్రాయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఆ నాడు ఆమె కొలువులో నేనొక బంటునైవుంటాను. లేకుంటే కల్పితమేయైనా ఆమె హావభావాలకు అక్షరశిల్పం చెక్కడం నావలన అయ్యేదికాదు.
ఈ నవలను ‘విష్ణుర్వై యజ్ఞః’ అనే వేదవాక్యంతో ప్రారంభించగలగడం నాఅదృష్టం. విష్ణువంటే వ్యాపించు స్వభావం కలవాడు. నేను యజుర్వేద భాష్యం చదివినందుకు ఆ తెలివితేటలు ఇందుకు ఉపయోగించాయి. ఈ నవల ఎప్పటికైనా గుర్తింపు పొందుతుంది.
ఈ నవలలో శృంగారం మోతాదు కొంచం ఎక్కువైందని వనితామణులన్నారు. ఇప్పుడు మనందరి కాలక్షేపం ఏమిటీ? విద్యుత్తుతో నడిచే సెల్ఫోను టీవి సినిమా రేడియో మైకు! ఇవేమి పుట్టకముందు? అదే! చాలా కావ్యాలు స్తోత్రాలు దేవాలయ శిఖరాలు పరిశీలించిన తరువాత ఈ అభిప్రాయానికి వచ్చాను.
కొందరు ఈ నవలలో ఈజిప్టు రాణి క్లియోపాత్రా ఎందుకు వచ్చిందీ అన్నారు. క్లియోపాత్ర ఇంచుమించుగా ఈ కాలానికి చెందిందే. ఆనాడు గ్రీకు ఈజిప్టు రోము వ్యాపారులు తరుచూ భారతభూమితో లావాదేవీలు సలిపేవారు. వారితోపాటు ఆనాటి నాటకం ప్రచారమయ్యిందని చెప్పటానికి.
అంతేకాకుండా ‘కావ్యేషు నాటకం రమ్యం’అన్నారు. అందుకే నాటకం లేకుండ పుస్తకం ముగించ దలుచుకోలేదు. రిచర్డుబర్టన్ సోఫియా లారెన్సు లను దృష్టిలో పెట్టుకుని వ్రాశాను.
ఈ నవలను గురించి పాఠకులు ఏమన్నారో చూద్దాం.
ఆదుర్తి బాల # ఈ నవల హిష్టరీ లెక్చర్ కన్నా మిష్టరీ పిక్చర్ లాగా ఉత్కంఠభరితంగా సాగుతుంది. రాజురాణీల సరస శృంగారం కొంచం ఎక్కువే అనిపించినా అందులో సాహిత్యం శాస్త్రం వ్యాకరణం కూడ నిండివుంది.
డా. పట్టస్వామి నాగప్రసాద్ # ఈ కాలంలో అశ్వమేధయాగం చేసేవాళ్ళూ లేరు, మనకు చూసే అవకాశమూ రాదు. ఈ నవల ద్వారా అదేమిటో తెలుస్తుంది.
ఖండవల్లి కౌసల్య # చరిత్రకారులకు శాతకర్ణి మహారాజు ఏమయిందీ తెలీక అయనను నిరాధారంగా చంపేశారు. కానీ చరిత్రకే ఒక పాఠం చెప్పినట్లుంది ఈ నవల. రవికాంచనిచో కవి కాంచునేకదా అనడానికి ఈ నవలే ఒక ఉదాహరణ. రచయిత ఈ నవలలో అశ్వమేధయాగం చేసే విధానం వ్రాయగలిగారంటే శృతి స్మృతి ఇతిహాస పురాణాది ఉద్గ్రంధాలను అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.
పట్టస్వామి కనకరాజు # కధలోని అన్ని స్త్రీ పాత్రలు సౌందర్యానికి ప్రతీక. అసలు స్త్రీ అంటేనే సౌందర్య స్రవంతి. కాని ఆధ్యాత్మిక విశ్వసౌందర్య దర్శనం పొందాలంటే స్త్రీ అనే సౌందర్య స్రవంతిని దాటాలి.
హైందవ ధర్మం ప్రతిమనిషీ భక్తియోగం నుంచి ఆరంభించి జ్ఞానయోగంలోకి మారి చివరకు వైరాగ్యాన్ని పొందాలని చెబుతుంది. అలాగే ధర్మ అర్ధ కామాలనే పురుషార్ధాలను సాధించిన మనిషి అంతటితో ఆగిపోకుండా మోక్షమనే చతర్ధ పురుషార్ధాన్నికూడా జేరుకోవాలని చెబుతుంది. ఈ నవల హైందవ ధర్మాన్ని ఆవిష్కరిస్తుంది.
కథనం విషయానికి వస్తే....ఉత్కంఠభరితమై ఆద్యంతం చదివిస్తుంది. సస్పెన్సు, థ్రిల్లరు, జేమ్సుబాండ్ కథలాగా ననమాట.
డా. ఆదుర్తి రవిప్రసాద్ # ఈ నవలలో రాజురాణీల సరసశృంగారం మాత్రం హృదయానికి హత్తుకునేటట్లు వుంది.

- కవికొండల చంద్రధరం

Preview download free pdf of this Telugu book is available at Andhrasatavahanula Aswamedhayagamu