• Andhrapatham
 • Ebook Hide Help
  ₹ 312
  312
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఆంధ్రపథం

  Andhrapatham

  Author:

  Publisher: Arts and Letters

  Pages: 162
  Language: Telugu
  Rating
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  '4.50/5' From 4 votes.
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  '4.50/5' From 2 premium votes.
Description

చరిత్రని శోధించాలంటే H G వెల్స్ మహాశయుడు కల్పించిన టైం మషిన్ కంటే అనువైన పరికరం ఉండదు. కానీ మన దురదృష్టం, ఈనాటికీ అది ఆకాశహార్మ్యంగానే మిగిలింది. దానిని కనుగొనేవరకూ చరిత్రను తెలుసుకొనేందుకు, మానవుని ఊహాశక్తియే మనకి దారి. అది వాస్తవికత కంటే అద్భుత కాల్పనిక లోకాలకు దారితీయడం కద్దు. చరిత్రకారులు గతంలోని రాజులను, కవులను, వీరులను కొందరిని దేవుళ్ళని చేసారు, మరికొందరిని దెయ్యాలను చేసారు. చారిత్రక రచనలన్నీ ఒకే కథ చెప్తాయి, అది మంచి చెడుల మధ్య పోరాటం, అయితే చెప్పేవారి దృక్కోణాలలోనే తేడా. సామాన్యుల జీవన సరళి గురించి చెప్పే చారిత్రక కథలు అరుదు. సామాన్యులు అంటే … వాళ్ళు మన తాతముత్తాతలు. మనలోని మంచి చెడులు వారిలోనూ ఉన్నాయి. కాలగమనంలో రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థలలో వచ్చిన వడిదుడుకులను వాళ్ళూకూడ మనలాగే అనుభవించారు, జీవనాలు సాగించారు. కానీ వారి వారసులమైన మనకి వాళ్ళ జీవనసరళి గురించి తెలిసింది మృగ్యం.

ఈ నేపధ్యంలో సాయి పాపినేని రచించిన ‘ఆంధ్రపథం - A Journey through History ఒక సరికొత్త కోవలో మన తాతముత్తాతల కథలను మనకి అందిస్తుంది. గతం లోతుల్లోని రాతియుగానికి చెందిన సంస్కృతీ స్తరాలనుండి, ఆధునిక యుగారంభం వరకూ, కాల స్రవంతిలో వచ్చిన పరిణామాలకు అద్దంపట్టే కథల సమాహరమిది. ప్రతి కథకూ అనుబంధంగా ఆనాటి నేపధ్యాన్ని వివరించే వ్యాసాలు, చరిత్రపై పాఠకుల అవగాహనను మరింత పరిపుష్టం చేస్తాయి.

* * *

“చారిత్రక కాల్పనిక సాహిత్యానికి అత్యావశ్యకమైన ముడిసరుకు పరిశోధన. ఆంధ్రుల చారిత్రక మూలాలను ఎంతగానో తరచిచూసి రచించిన ఆంధ్రనగరి నవల ద్వారా, సాయి పాపినేని గారు ఈ దిశలో తమదైన స్థానం ఏర్పరుచుకున్నారు. ఈ పుస్తకంలోని ప్రతి కథా సహజత్వానికి దగ్గరగా శాస్త్రీయ ప్రమాణాలకు నిలబడేవిధంగా ఉన్నాయి.”

- శ్రీ తమ్మారెడ్డి భరధ్వాజ

* * *

“ఈ పుస్తకం నేటి తెలుగువారి ఆస్తిత్వానికి కారణభూతమైన చారిత్రక దశలను పాఠకులకు పరిచయం చేస్తుంది. ఎవరో రాజులూ, ఏవో యుద్ధాలను గాక ఈ కథలు మన తాతముత్తాతల జీవనసరళిని కళ్ళకు కడతాయి.”

- శ్రీ ఆనంద్ కూచిభొట్ల, సిలికానాంధ్ర సంస్థాపకులు

* * *

“చరిత్ర పై వచ్చిన కాల్పనిక సాహిత్యంలో ఇంత విస్తృతమన ప్రయత్నం ఇంతకు ముందెన్నడూ చేయబడలేదు. క్రీపూ. 2000 నుండీ 1945 వరకూ సాగే 27 చారిత్రక కథల సంకలనమిది. ఈ కథలు చరిత్ర పథంలోకి పాఠకుడిని వేలుపట్టి నడిపించడమే గాక, తెలుగు రాష్ట్రాల మూలమూలలనూ దర్శింపజేస్తాయి.”

* * *

“చరిత్రను కేవలం చెప్పడం కాకుండా దృశ్యమానం చేయడం ఇది.”

Preview download free pdf of this Telugu book is available at Andhrapatham
Comment(s) ...

Nice Book.It definitely creates interest on knowing the history of the places we have grown up. As author says history is not about knowing the rulers and kingdoms. It is all about the living of normal people shaping up future societies. Need more and more books like this.

Nice depiction of Telugu culture in ancient days up to British period.
Kudos to the writer !!!
We need to popularize such novels to convey to the whole world the richness of Telugu culture which unfortunately even our own Telugu people are not aware of and do not take pride of.
Jai Ho Telugu!