-
-
ఆంధ్రనాయక శతకము
Andhranayaka Satakamu
Author: Dr. Addanki Srinivas
Publisher: S.R. Book Links
Pages: 159Language: Telugu
ఆంధ్రనాయకశతకము - తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన రచన. చారిత్రక, పౌరాణికాది అనేక నేపథ్యాలు బాగా తెలిస్తే కానీ సంపూర్ణంగా అర్థం కాని శతకం. పైగా రాసిన కవి సామాన్యుడు కాదు. చతుర్విధ కవిత్వాలు నేర్చి, రాజాస్థానాలలో ఎలాంటివారినైనా మెప్పించగలిగిన, ప్రౌఢ మర్మగర్భోక్తులతో కవిత్వం అల్లడంలో ఆరితేరిన భట్టుకవి.
దీనికి తోడు ఈ శతకానికి ఒక చారిత్రక 'అవశ్యకతాపూరణం' కూడా ఉంది. ఈ కవిగారి కాలంలో శ్రీకాకుళక్షేత్రంలో పూజాదికార్యక్రమాలు సరిగా జరగడం లేదట. అందువల్ల దేవుడు - ఉత్సవాలు లేక వెలవెలపోతున్నాడని కవిగారి మనసు కలత చెందింది. ఆ బాధను ఎవరిముందు వెళ్ళగక్కితే ఎవరు ఊరుకుంటారు గనక! అందుకే 'ఆ తిట్టేదేదో ఆయన్నే సున్నితంగా తిడదాం!' అని ప్రారంభించాడు. అందుకు వ్యాజస్తుతి అలంకారం బాగా అక్కరకు వచ్చింది. దానికో మంచి మకుటం పెట్టుకొని సీసపద్యాలలో శతకాన్ని 'భళీ!' అనిపించాడు. అదే ఈ శతకం. అందుకే ఆ శతకానికి వ్యాఖ్య అవసరమయ్యింది.
ఈ శతకానికి ఇంతకుముందు కొన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. కొన్ని లఘువ్యాఖ్యలూ ఉన్నాయి. అయినా పురాణగాథలను అన్వయించుకోవడంలోని కష్టాలు, తెలుగు నుడికారాల్లోని అందాలు, ముఖ్యంగా పైకి నిందలా కనిపిస్తూ లోపల ఉండే అందమైన స్తుతినీ పట్టుకోవడం వ్యాఖ్యాతలకు కష్టసాధ్యమే. వీటన్నింటితో క్లిష్టత అధికమైన ఇలాంటి రచనలకు ఎన్నిసార్లు ఎందరు వ్యాఖ్యానం చెప్పినా నష్టం లేదనీ ఇంకా కొత్త అందాలు కనిపిస్తాయనీ నాకు అనిపించింది. అందుకే ఈ ప్రయత్నం.
- డా. అద్దంకి శ్రీనివాస్

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹72