-
-
ఆంధ్రనగరి - Song of the Black River
Andhranagari
Author: Sai Papineni
Publisher: Arts and Letters
Pages: 236Language: Telugu
క్రీ.పూ.మూడవ శతాబ్దంలో కృష్ణా నదీమతల్లి ఒడిలో వికసించి ఒక వెయ్యేళ్ళు ఆసియా మారుమూలలకీ నాగరికతని పంచిన అమరావతి కథ - ఆంధ్రనగరి - Song of the Black River.
* * *
ఆంధ్ర ప్రజలకి చరిత్ర అంటే అవగాహన తక్కువ. ఇది అతిశయోక్తి కాదు. ప్రపంచమంతా తమతమ చారిత్రక సాంస్కృతిక విషయాలు అందరికీ తెలిసే విధంగా చెప్పడం ఒక ఉద్యమరూపంలో చేస్తుంటే మనవాళ్ళలో... ప్రపంచమంతా ప్రాముఖ్యం కలిగిన అమరావతి శిల్పశైలి గురించి చాలా కొద్దిమందికి తెలుసు. దీనికి ముఖ్యకారణం మన విద్యావ్యవస్థే. నాలుగున్నర శతాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా సగానికి పైగా భారతదేశాన్ని పాలించిన శాతవాహనుల గురించి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీకి మించి ఉండదు. అదే ఢిల్లీలో వందేళ్లు కూడా నిలవని వంశాలపై పూర్తి పాఠాలే ఉంటాయి.
పాశ్చాత్యదేశాల్లోలా చారిత్రాత్మక నవలారచన తెలుగులో చాలా తక్కువ. కథ కల్పితమే అయినా చారిత్రక వాస్తవానికి దగ్గరగా రాయాలంటే ఎంతో పరిశీలన అవసరం. అది ఖర్చుతో కూడుకొన్న పని. ప్రతిఫలం తక్కువ. దానితో ఎంతో కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఈ నేపధ్యంలో మారుతున్న అలవాట్లనూ, అభిరుచులనూ మనసులో పెట్టుకొని చరిత్రపై పాఠకుల ఆసక్తిని పెంచే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నమే... ఆంధ్రనగరి.
* * *
"ఇది నవలా? అంటే అవును, కాదు. ఇది చరిత్రా అంటే? అవును, కాదు. ఇది మన చారిత్రక, సాంస్కృతిక పరిశోధనాత్మక విశేష నవలా? అంటే అవును, అవును అని ముమ్మాటికి చెప్పదగినది... మన తెలుగు నగరి "అమరావతి” పై రాసిన తొలి తెలుగు నవలగా చెప్పవచ్చు. మన జాతి గొప్పది, మన శిల్పప్రాభవం గొప్పది... అంటూ కనువిప్పు కలిగించే నవల ఇది. ఎందరెందర్నో సంప్రదించి, చర్చించి, తెలుసుకుని ఒక నవలగా రాయటం- మాటలు కాదుగాని- మాటలే అని నిరూపించారు సాయి పాపినేని.”
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, నవ్య వారపత్రిక
* * *
"సాయి పాపినేని రచించిన ఆంధ్రనగరి... ఆద్యంతం విలక్షణమూ, విభిన్నమూ... ఇంతకు ముందెవ్వరూ చెప్పలేదనిపించేంత ఆసక్తిగా రాయడమే మంచి రచయితల లక్షణం. ఆ ప్రాతిపదికన చూసినప్పుడు ఆంధ్రనగరి ఉత్తమ పుస్తకాల కోవలోకి వస్తుంది. ఈ పుస్తకం కృష్ణానదీ తీరాన వెలసిన తెలుగువారి వైభవోపేత చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపదకు దర్పణం పట్టింది... మన చరిత్రను అందమైన కథలుగా మలచి పాఠక దేవుళ్ళకు అందించిన నైవేద్యం ఈ పుస్తకం.”
- ఉల్చాల హరిప్రసాదరెడ్డి, తెలుగు వెలుగు.
A must read for all Telugu people to discover their roots. It is the responsibility of two Telugu states to make efforts to take up with pride the rich history of Telugu people by incorporating the Satavahana dynasty
@sureshmohan:
The eBook was priced in par with paper back book, Whereas the print book version is Hard Bound.
Hard Bound was priced as Rs.500/- by the publisher and supplied to us at the same price.
Why there is no rent book option?
Pls provide rent book
Please provide option for RENT this book.
Book lo price 290/- vundi .. meeru 500/- ani chupisthunaaru ?????