• Andhra Pradesh Congress Charitra
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ చరిత్ర

    Andhra Pradesh Congress Charitra

    Publisher: Victory Publishers

    Pages: 435
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ చరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్‌ చరిత్రే ! రాష్ట్ర రాజకీయ పరిణామాల సమగ్ర చిత్రణ కూడా ! చరిత్రనుంచి ఎప్పుడూ పాఠాలు నేర్చుకోగలగాలి. స్వాతంత్య్ర కాలంనాటి కాంగ్రెస్‌ చరిత్ర త్యాగ భరితం. సేవా భరితం. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ చరిత్రలో అది లోపించిందనటం కఠినంగా కనిపించే వాస్తవం. పదవీ వ్యామోహాలు, పరస్పర వైషమ్యాలు, అంతః కలహాలు ఇవి సర్వే సర్వత్రా సాధారణమైన విషయాలే అయినప్పటికి కాంగ్రెస్‌ అందుకు మినహాయింపు కాలేకపోయింది. కాంగ్రెస్‌ పలుసార్లు ప్రజలకు దూరమై వారి నిరాదరణకు గురయిన సందర్భాలు దీని ఫలితమే !

కాంగ్రెస్‌కు పరాజయాలు సంప్రాప్తమయిన ప్రతిసారీ ప్రభుత్వ వైఫల్యాలకన్నా నాయకుల వ్యక్తిగత విలువలు మితిమీరిన రీతిలో వెర్రితలలు వేసి, పరస్పర దూషణలతో ప్రజలముందు పలుచన కావటం ప్రముఖంగా కనిపిస్తుంది. సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఎప్పుడూ మంచివే ! అందువలన పార్టీ బలోపేతమే అవుతుంది. అలాంటి సందర్భాలూ ఉన్నాయి. కానీ, వ్యక్తిగతమైన విభేదాలే కాంగ్రెస్‌ సంస్థను బలహీన పరచిన సంఘటనలు అనేకం ఈ గ్రంథంలో ఉదహరించబడ్డయి. వర్తమానంలో వాటిని పరిహరింపచేసుకొని భవిష్యత్తులోకి పయనించినప్పుడే కాంగ్రెస్‌ సంస్థ అభ్యున్నతి సాధ్యం అవుతుందనే సందేశం ఇందులో ఉంది. చరిత్ర నుంచి నేర్చుకోదగిన పాఠం ఇదే గదా ! ప్రజా సేవానురక్తి తగ్గి స్వార్థ దృష్టి ప్రబలిన నేటి రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్‌ మార్గదర్శకంగా నిలబడవలసిన అవసరం ఎంతయినా ఉంది. అందుకు ఆత్మ పరిశీలన అవసరం.

కాంగ్రెస్‌ పుట్టి పెరిగింది ప్రజల మధ్యనే కనుక ప్రజల ప్రేమానురాగాలతోనే అది మనుగడ సాగించాల్సి ఉంది. దానికి మరింతగా ఆత్మ శోధన జరగాలి. ఆశావాదంతో మనం అలా జరగగలదని భావిద్దాము. అందుకు ఈ గ్రంథం కాంగ్రెస్‌ వాదులకు ఉపకరించాలి.

- మండలి బుద్ధ ప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Andhra Pradesh Congress Charitra