-
-
ఆంధ్ర మహా సావిత్రి
Andhra Maha Savitri
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 630Language: Telugu
ఆంధ్ర మహాసావిత్రి వచన రచన. అయితే కవితాత్మక రచన. ఇది 'పునఃసృష్టి' అని ఎందుకు అనవలసి వచ్చిందంటే కేవలం అనువాదం కాదు కనుక. 'అనుసృజన' కనుక. ఇది కవితాత్మగల యోగప్రబంధం. ఇది నాలుగవ ముద్రణ. అర్థం కాలేదని అంటూనే ఆంధ్రమహాసావిత్రిని అభిమానించే వారు, చదివేవారు ఎక్కువైనారు, ఇది చదవడం వల్ల అనుభూతి కలుగుతుంది. యోగసాధన పెరుగుతుంది. అన్ని పుస్తకాలు అందరికీ నచ్చాలని లేదు. అయినా నేను అందరి కోసం రాయడం లేదు. అందరినీ అలరించే విధంగా రాయలేను. యోగజిజ్ఞాస కలవారికోసం రాస్తాను. యోగార్హత కలవారు మాత్రమే నా పుస్తకాలు చదవగలరు. అర్థం చేసుకుని, అనుభూతించగలరు. అలాంటి వారికి తప్పకుండా నా రచనలు అర్థమవుతాయి. ఆధ్యాత్మిక తపనగల వారిని ఒక మెట్టుపైకి తీసుకుపోతాయి. ప్రాపంచిక విషయాలపట్ల ఆసక్తి తగ్గి, ఆధ్యాత్మిక విషయాల పట్ల అభిరుచి, అభినుతి పెరిగినవారు నా పాఠకులు. తపనను తపస్సుగా మార్చుకోగలిగిన వారు, ఏదో ఒక యోగమార్గంలో అభిరుచి కలవారు 'ఆంధ్ర మహాసావిత్రి'ని అర్థం చేసుకోగలరు. లబ్ధి పొందగలరు. యోగసాధన చేస్తున్న వారి కోసం 'ఆంధ్ర మహాసావిత్రి' కొత్త వాకిళ్లు తెరుస్తుంది. మంచి ఆలోచనలు కలగాలంటే ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. ఓపెన్ మైండ్‌తో సావిత్రిని చదవాలి. అధ్యయనం చేయాలి. నిత్యం పారాయణ చేస్తుండాలి. ప్రతిరోజు ఒకటి రెండు పేజీలు చదివినా చాలు. చదివిన తర్వాత కళ్లు మూసుకుని అంతర్ముఖులు కావాలి. అంతర్యామిని అనుభూతించాలి, శూన్యం కావాలి.
- శార్వరి
