కత్తి వదిలి కాలు వెంబడే ఎగిరి గింగిరాలు తిరుగపతూ పోయి ఓ చెట్టును గుద్దుకును కిందపడ్డాడు. వాడేమయ్యాడో కూడ చూళ్ళేదు జాన్సీ. కిందపడున్న కత్తిని సొంతం చేసుకొని ముందుకు పరుగుతీసింది. తన వెనకే ఆ రౌడీ కేకలు వేయడం వినిపిస్తూనే ఉంది.
అప్పటికే లోయలోకి వచ్చేసిందామె.
ఒక సెలయేటిని చూడగానే ప్రాణం లేచివచ్చినట్టయింది. వేగంగా అటువైపు పరిగెత్తింది. కత్తి పక్కన పడేసి వాగు నీటిలో ముఖం కడుక్కుంది. దాహం తీరేలా నీరు త్రాగింది.
సరిగ్గా అప్పుడే -
వూహించని మరో ప్రమాదం వచ్చిపడింది.
జాకీ అనుచరుల్లో ఒకడు ఎలా వచ్చాడో అక్కడికి వచ్చేశాడు. వాగు దగ్గర జాన్సీని ఛూడగానే పిల్లిలా ఆమె వెనక్కి చేరుకున్నాడు. కాలితో కత్తిని దూరంగా తన్నేస్తూ ఆమె నడుం పుచ్చుకిని ఎత్తి అవలకు విసిరేసాడు.
వాగు ఒడ్డున ఇసుకలో దబ్బున పడి భాధతో కీచుగా అరిచిందామె. తల తిప్పి వాడ్ని చూసింది. పోత పోసిన ఇనుప విగ్రహంలా వున్నాడు. వికారంగా నవ్వుతూ మీదపడ్డాడు.
