-
-
అందమైన ఆలోచన
Andamaina Aalochana
Author: Chodesetti Srinivasa Rao
Publisher: Chodesetti Venkata Ramana
Pages: 112Language: Telugu
కాకినాడ నేపథ్యంగా సాగిన 'అద్దెయిల్లు' కథ కమనీయంగా ఉ౦ది. పరిసరాల వర్ణణ పరిపూర్ణత నిచ్చింది. శైలి సరళంగా సాగింది. కొసమెరుపు వల్ల కథ బ్రతికింది.
- శ్రీకంఠస్ఫూర్తి, పిఠాపురం
ఫిబ్రవరి 86 విపులలో ప్రచురితమైస మీ 'విలువ' కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సమాజంలో నాగరికత ముసుగులో ఉన్న 'హిపోక్రసీ' చాలా బాగా చిత్రీకరించారు. అ కథను ఇంగ్లీషులోకి అనువదించి తెలుగుకథ యొక్క చక్కదనాన్ని తెలుగు అంతగా తెలియని మిగతా భారతదేశానికంతటికీ తెలియజేయాలనుకుంటున్నాను - ఇందుకు మీ అ౦గీకారం కోరుతూ...
- శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి, న్యూఢిల్లీ
ఓ సభలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. 'ఇండియా టుడే' లో వ్యంగ్యప్రధానమైన మీ కథ 'జోక్' చదివి ఆనందించాను.
- అద్దేపల్లి రామమోహన రావు, న్యూఢిల్లీ
మీ 'లోటు' కథ కంటనీరు పెట్టించింది. నా జీవితంలో జరిగిన ఓ సంఘటనకు కథా రూపం ఇచ్చినట్లుగా ఉంది.
- కలుమంగి కృష్ణమూర్తి, న్యూఢిల్లీ
మనుషుల మధ్య అనుబంధాలు, రాగద్వేషాలూ, వీటి ఉద్వేగానుద్వేగాలు ఇవన్నీ ఈ కథానికల్లో స్పృశించబడ్డాయి.
- విహారి, హైదరాబాద్
