అనగనగా మరిన్ని కొత్త కథలు
బ్నిం
బ్నిం గురించి
ముందు వాటర్కలర్ పెయింటింగ్స్ వేస్తూ, బహుమతులు పొంది, 1980-90ల మధ్య కార్టూన్స్ కేరికేచర్స్తో అనేక పత్రికల్లో పేరు అచ్చులో చూసుకుని 'నీలాప్రియ', 'బియ్యెన్మూర్తి ', 'కార్తీకమూర్తి' లాంటి బోల్డన్ని పేర్లతో కథలు, వ్యాసాలు గట్రా రాసి రెండు మూడు పత్రికల్లో స్టాఫ్‌లో పనిచేశాక, ఉద్యోగం చేసే ఓర్పు పోయి ఓపిక కోసం టీవీల్లో స్క్రిప్ట్ రాసే ఉద్యమం చేపట్టాక బ్నింకి ఓ పేరు స్థిరపడింది
నాలుగు సార్లు నంది అవార్డు వచ్చాక కథ స్క్రీన్‌ప్లే మాటలు, టైటిల్ సాంగ్స్ రాయగల ధైర్యం పెరిగాక, గొప్పవాళ్ళతో పనిచేయడం - వాళ్ళు చేస్తున్నప్పుడు చూసే అదృష్టం కలగడంతో ఆనందంతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇలా ఉంటూండగానే క్లాసికల్ ఫోక్ డాన్సుల కోసం సుమారుగా నూరు నృత్యరూపకాలు రచన చేసి వాటన్నింటిని ప్రముఖులు నర్తిస్తుండగా చూసి పులకించడం జరిగింది.
ఇది బ్నిం రాసిన అయిదో పుస్తకం .
