-
-
అమూల్యం
Amulyam
Author: Nandoori Sundari Nagamani
Publisher: J.V.Publications
Pages: 175Language: Telugu
కథాభిమానులను ఆకర్షించే లక్షణాలన్నీ ఈ సంపుటిలో పుష్కలంగా వున్నాయి. కథలన్నీ జీవితానికి సన్నిహితమైనవి. పాత్రలలో వైవిధ్యం వుంది. సన్నివేశాలలో వాస్తవికత వుంది. కథనంలో ఏకబిగిన చదివించే గుణం వుంది. నాగమణి రచనల్లో నాకు నచ్చిన అంశం ఆమె తన కథల్లో ఇతివృత్తాలుగా స్త్రీ జీవితాలని ప్రముఖంగా తీసుకున్నప్పటికీ, ఆమె ఏదో ఇక 'ఇజం' ఒక 'వాదం'కి కట్టుబడిపోయి, గిరి గీసుకొని ఆ హద్దుల్లో తన రచనలు చెయ్యకపోవడం. ఎక్కడ ఉపన్యాస ధోరణి కనబరచకపోవడం, ఆదర్శాలు వల్లె వేయకపోవడం. మన జీవితాలు, సమస్యలు ఎంతో విస్తృతమైనవి, మామూలు నీతిసూత్రాలతో వాటికి హద్దులు ఏర్పరచటం అసాధ్యం అని ఆమె గుర్తించమే దానికి కారణం.
ఈమె కథలు ఆహ్లాదాన్ని కలగజేస్తాయి. చదవటం మొదలుపెట్టాక మధ్యలో ఆపాలని అనిపించదు. మంచి భాషా శైలి ఉన్న రచయిత్రి. భవిష్యత్తులో ఈమె కలం నుంచి మరిన్ని మంచి కథలు రావాలని కోరుతున్నాను.
- ఆర్. శాంతసుందరి
* * *
రచన రచయిత/లేక/రచయిత్రి సంస్కారాన్ని ప్రతిబింబిస్తుందనడనికి యీ కథాసంకలనం ఓ ఉదాహరణ. 'ఇంతింతై వటుడింతై' అన్నట్టుగా తప్పటడుగుల నించి దృఢమైన వ్యక్తిత్వానికి ఎదిగిన రచనలు నాగమణిగారివి. ఈ కథల్ని నేను సామాన్య పాఠకుడిగానూ, కథల్ని ప్రేమించే మామూలు మనిషిగానూ చదివాను.
'ఇమాజినేషన్ యీజ్ గ్రేటర్ దేన్ నాలెడ్జ్' అన్నారు. ఐన్స్టీన్గానీ, టీవీలుగానీ, సినిమాలుగానీ..., ఊహాశక్తిని పెంచవు. వారు ఏది వూహించి చూపిస్తే అదే మనం చూడలి. పుస్తకాలు అలా కాదు. ప్రతి పాత్రా మనకిష్టం వచ్చినట్టు మన 'వూహ'లోనే రూపుదిద్దుకుంటుంది. అందుకే చదవండి... చదివించండి.
- భువనచంద్ర
