-
-
అమృతస్య పుత్రాః
Amrutasya Putraha
Author: Swami Srikantananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 160Language: Telugu
'ఐ యామ్ ఎ వాయిస్ వితౌట్ ఎ ఫార్మ్' పేరుతో ఆంగ్లంలో ప్రచురింపబడ్డ వివేకానందుని భావాల సంకలనానికి తెలుగు రూపమే ఈ 'అమృతస్య పుత్రాః.' ఆంగ్లంలో అనేక మార్లు ముద్రించబడి కొన్ని వేలప్రతులు అమ్ముడవటం మాకు మహదానందాన్ని కలిగించి పుస్తక తెలుగు అనువాదానికి మమ్మల్ని ప్రేరేపించింది. పుస్తకాన్ని సరళ వ్యావహారికంలోకి అనువదించి ఇచ్చినవారు శ్రీ అమిరపు నటరాజన్. వారికి మా కృతజ్ఞతలు.
మహోజ్జ్వల భావరాశి అనదగ్గ స్వామి వివేకానంద ఉపన్యాస పరంపర, రచనా వ్యాసంగాలు తెలుగులో 'లేవండి, మేల్కొండి' పేరుతో పదిసంపుటములలో లభ్యమవుతున్నాయి. అయితే వివేకానందుని భావాలను ఆసాంతం చదవడనికి తీరికలేని ప్రస్తుత తరంవారికి పది సంపుటాలను సంగ్రహించి కొన్ని చక్కటి భావాలను ఏరి ఒక పుస్తకాన్ని వెలువరిస్తే బాగుంటుందని తలచి ఇదివరకే తెలుగులో ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని వెలువరించటం జరిగినది. ఆ ప్రయత్నం మాకు కొంత సంతృప్తినిచ్చినా పరితుష్టులుగా చేయలేకపోయింది. అందుకే రెండవ ప్రయత్నం ద్వారా ఇంకా మెరుగైన సంకలనాన్ని అందిస్తున్నాము. ఈ సారి భావాలకు చిత్రరూపాన్ని కూడ ఏర్పరిచి మీ ముందుంచుతున్నాము; భావాలు సులభంగా అర్థమవ్వాలని. భావాలలోని తత్త్వాన్ని సులభంగా గ్రహించటానికి ఈ చిత్రాలు దోహదపతాయని మా అభిమతం.
స్వామి వివేకానంద భావాలు జాతి మేధో వికాసానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి శక్తి గుళికలుగా పనిచేస్తున్నాయి. అపారమైన విజ్ఞాన ఖని అనదగ్గ ఆయన ఆలోచనా పరంపర పాశ్చాత్య నాగరికత ప్రభావంలో పడి భోగలాలసే జీవన లక్ష్యంగా సాగుతూ, జవసత్త్వాలను కోల్పోతున్న బలహీన మనస్సులకు ఉత్తేజ వర్ధకం, ఓజోప్రసాద కారకం.
నైతిక విలువలు లేని ఏ నాగరకత గొప్ప నాగరకత అనిపించుకోదు. నైతిక ప్రమాణాలు లేకుండ సామాజిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అర్థరహితాలు. స్వామి వివేకానంద భావాలు ప్రజలను ధర్మానుష్టానపరులుగా చేస్తాయని మా ప్రగాఢ విశ్వాసం. ఆధ్యాత్మికతే భారతదేశానికి పునాది అని; ఆ పునాది గట్టిగా ఉన్నంతవరకూ భారతజాతి మహోజ్జ్వలంగా భాసిస్తుందని; ఆ పునాది బలహీనమైతే జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని స్వామీజీ హెచ్చరించారు. మన ప్రస్తుత సమాజ పోకలను బట్టిచూస్తే మనం ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టినట్లు కన్పిస్తున్నది. స్వామీజీ సందేశం ఈ పెడ పోకడలను నిరోధిస్తుందని మా విశ్వాసం.
యాంత్రిక జీవన సుడిగుండంలో చిక్కుకొని విరామం, విశ్రాంతి ఎరుగకుండ పరిభ్రమిస్తున్న ఆధునిక మానవుడికి కొంతైనా స్వామి వివేకానంద సందేశాన్ని సులభగ్రాహ్యంగా అందించాలన్న స్వామి శ్రీకాంతానంద సంకల్పమే ఆంగ్లంలో మేము వెలువరించిన 'ఐ యామ్ ఎ వాయిస్ వితౌట్ ఎ ఫార్మ్,' గా రూపుదిద్దుకుంది. తెలుగు భాషావరులకు కూడ ఈ సత్ప్రయత్న ఫలితం అందాలన్న మా ఆకాంక్షకు ప్రతిరూపం మీ చేతులో ఉన్న 'అమృతస్య పుత్రాః.'
ఈ పుస్తకంలో మేము సంగ్రహించిన భావాలు అకుంఠిత దేశభక్తు, కర్మవీరుడు, మహా ప్రవక్త అయిన స్వామి వివేకానంద ప్రజ్ఞాపద్మ వికసనాన్ని చదువరులచే కొంత వరకు తిలకింపజేసినా మా ప్రయత్నం సఫలమైందని భావిస్తాము.
- ప్రకాశకులు
గమనిక: "అమృతస్య పుత్రాః" ఈ-బుక్ సైజ్ 17.8 MB

- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹540