-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
అమృత దర్శనం (free)
Amruta Darsanam - free
Author: Viswapathi
Publisher: Self Published on Kinige
Pages: 147Language: Telugu
పూర్వజన్మలలో నాతో బంధం ఉన్నవారందరు ఈ జన్మలో ఏ విధంగా తిరిగి నన్ను కలుస్తున్నారో ఈ పుస్తకంలో వివరించాను. అంతే కాకుండా జన్మ జన్మల బంధాలు ఎలా ఉంటాయో కూడా ఈ పుస్తకంలో వివరించాను. ఈ పుస్తకంలోని విషయాలు కొన్ని నమ్మశక్యం కానివిగా అనిపిస్తాయి. అసలు ఏ మాత్రం ఊహకు కూడా అందనివిగాను అనిపించవచ్చును. ఈ పుస్తకంలోని విషయాలు అర్థం చేసుకుంటే మనం నిత్య జీవితంలో ఎదుర్కుంటున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఈ పుస్తకాన్ని నెమ్మదిగా చదవండి. అంతే కాదు... ఒకటికి రెండుసార్లు చదవండి. అప్పుడే మీకు ఇందులో వ్రాసిన విషయాలన్నీ తేలికగా అర్థమవుతాయి. మీకు జీవితంలో ఏ సమస్య కలిగినా, మనశ్శాంతి లేకపోయినా ఈ పుస్తకంలో ఏవైనా నాలుగు పేజీలు చదివితే వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరికి మీకు పూర్తి మనశ్శాంతి లభిస్తుంది. ఇది సత్యం...
ఈ పుస్తకంలో వ్రాసిన విషయాలన్నీ మీలో కొందరికి ఎప్పుడో తెలిసిఉండవచ్చును. మీలో చాలామంది సాధారణ ప్రపంచానికి సామాన్య వ్యక్తులుగా కనబడుతున్న సిద్ద పురుషులు కూడా కావచ్చును. మీ అందరికి ఎన్నో గొప్ప అనుభూతులు కలిగివుండవచ్చును. ఎందరో దేవతల దర్శనం కూడా లభించి ఉండవచ్చును. ఎవరి అనుభూతులు వారికే ప్రత్యేకం కదా! నేను ధ్యానంలో ఉన్నప్పుడు నాకు కలిగిన అనుభూతులు మీతో పంచుకుంటున్నాను.
- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి
