• Amma Nuvvu Maaraavu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మా! నువ్వు మారావు

    Amma Nuvvu Maaraavu

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎన్నిసార్లు ఉత్తరం రాసినా రాని ఇద్దరు కొడుకులూ, కూతురు ఈసారి మాత్రం ఉత్తరం రాయగానే పండగకి వచ్చేశారు. అనుకున్న టాపిక్‌ పండగనాటి మధ్యాహ్నం వచ్చేసింది.

పెద్దకొడుకు ''నాన్నగారూ... రిటైర్‌మెంట్‌ తీసుకున్నారుగా. ఇక్కడేం పని ? మా దగ్గరికి వచ్చెయ్యండి'' అన్నాడు.

చిన్నకొడుకు ''అవును నాన్నా ! ఇన్నాళ్ళు కష్టప్డరుగా. హాయిగా రెస్టుగా ఉండొచ్చు. మీకు అంతగా మొహమాటంగా ఉంటే ఆ వచ్చిన తృణమో ఫణమో ఇచ్చి మా దగ్గరే ఉండొచ్చు'' అన్నాడు తెలివిగా.

''కొడుకుల దగ్గరే తల్లిదండ్రులు ఉండలనే రోజులు పోయాయి. ఎక్కడ వీలుగా ఉంటే అక్కడే ఉండొచ్చు. మామగారికి పల్లెటూరి వాతావరణం అంటే ఇష్టం. మాది పల్లెటూరే. కాబట్టి మా ఊర్లో మా దగ్గర ఉండొచ్చు'' అన్నాడు అల్లుడు సరిసమానమైన తెలివితో.

''అదేమిటి ? కొడుకులు తరిమేశారని అందరూ ఆడిపోసుకోవడనికా ! అయినా మా దగ్గర మాత్రం ఎప్పుడున్నారు? ఉద్యోగం అంటూ ఎప్పుడూ రానేలేదు పాపం.'' అంది చిన్న కోడలు.

''అవునవును. లోకనింద భరించం కష్టం. నిజానికి కాశీలో ఉండాలి లేదా పెద్ద కొడుకు దగ్గర ఉండాలి అంటారు. అందువల్ల మా దగ్గరే ఉండడం సమంజసం'' అంది పెద్ద కోడలు 'పెద్దకొడుకు' అన్న పదం ఒత్తిపలుకుతూ.

''ఆ రోజులు పోయాయి వదినా. కొడుకైనా, కూతురైనా సమానమని ఆస్తులలోనే సమాన హక్కులు కలిగిస్తున్న రోజులివి. అట్లాంటప్పుడు బాధ్యతలు సమానం కావా'' అంది కూతురు 'ఆస్తులు' అన్న పదం నొక్కి మాట్లాడుతూ.

Preview download free pdf of this Telugu book is available at Amma Nuvvu Maaraavu