-
-
అమ్మా...... నన్ను క్షమించొద్దు
Amma Nannu Kshaminchoddu
Author: Dr. C. Bhavani Devi
Pages: 116Language: Telugu
సమాజ స్వరూపాన్ని పరిశీలిస్తూ, మానవ జీవితాన్ని అధ్యయనం చేస్తూ, ఆరాధనాభావంతో సాహిత్య కృషి చేస్తున్న రచయిత్రుల్లో ప్రథంమశ్రేణి విదుషీమణిడా. చిల్లర భవానీదేవి గారు.
ఆమె సాహిత్య వ్యాసంగం ఎంతో చైతన్యవంతమైనదీ, వైవిధ్యభరితమైనది. ఉత్తమ కవిత్వం రాశారు. 'నాలోని నాదాలు' నుండి 'అక్షరం నా అస్తిత్వం' వరకూ6 కవితా సంపుటాలు వెలయించారు. నాటకం, 8 నాటికలు, 6 సంగీత రూపకాలు, 2 వ్యాస సంపుటాలు, 2 నానీ సంపుటాలు, అనువాదాలు, కథాసంపుటి ప్రచురించారు. ఈ పుస్తకం భవానీదేవి రెండవ కథాసంపుటి. 1993లో 'అంతరంగ చిత్రాలు' మొదటిసంపుటి వచ్చింది.
కథారచనలో భవానీదేవిదొక ప్రత్యేకమార్గం. మనుషుల జీవిత చిత్రణతో పాటు, వారి మనస్తత్వ విశ్లేషణనీ కథాంతర్గతంగా చిత్రించగలిగిన నేర్పరి ఆమె. మధ్యతరగతి మనుషుల గురించీ, వారి అంతరంగ సంవేదనల్ని గురించి కథలు రాస్తూ పాఠకుల్ని మెప్పిస్తున్నారు భవానీదేవి. ఇదీ విశేషం. తెలిసిన మనుషుల్ని గురించి రాస్తే పాఠకులకి నమ్మకం కలుగుతుంది అంటారు - పద్మరాజుగారు. ఈ సంపుటిలోని కథల్లో మనకు తారసపడే వ్యక్తులంతా ఈ తరగతికి చెందినవారే. వీరంతా భవానీదేవికి బాగా తెలిసినవారు! వారినే మనముందుంచారు!
భవానీదేవిగారి కథలు మధ్యతరగతి జీవిత వర్ణచిత్రాలు. కొన్ని మీనియేచర్స్, కొన్ని వాల్ప్లేట్స్, కొన్ని కుడ్యచిత్రాలు!!
- విహారి

- ₹64.8
- ₹108
- ₹64.8
- ₹64.8
- ₹216
- ₹270