-
-
అమ్మ మాట - తేనె మూట
Amma Mata Tene Muta
Author: Akella Venkata Subbalakshmi
Publisher: Self Published on Kinige
Pages: 80Language: Telugu
శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు మూడు దశాబ్దాలకు పైగా రచనలు చేస్తున్న సృజనశీలి. వారిప్పటికి 14 పుస్తకాలు ప్రచురించారు. వాటిలో సింహభాగం బాల సాహిత్యానిదే. పిల్లల కోసం వారు రాసిన కథలూ, కవితలూ ఆ రంగంలో అందరి మన్ననలు పొందాయి. వయోజన కథా పుస్తకాలను కూడా వారు వెలువరించారు. ముఖ్యంగా ప్రస్తుతం బాల సాహిత్యంతో మమేకమై వున్నారు.
బాల సాహిత్య సృజన అందరికీ సాధ్యం కాదు. పిల్లల లోకంలోకి వెళ్లగలిగిన మాతృహృదయ సంపన్నులకే అది సాధ్యం. పిల్లల కోసం రచనలు చెయ్యాలంటే పిల్లల స్థాయికి దిగాలి అనుకుంటారు కొందరు అమాయకులు అది తప్పు, పిల్లల స్థాయికి ఎదగాలంటాను నేను.
'అమ్మ మాట - తేనె మూట' అన్న ఈ సంపుటిలో 30 కథలున్నాయి. ప్రతి కథా అమ్మ చెప్తున్నట్టే పసి సమ్మితంగా వున్నాయి. అలాగే మనసుకు హాయిగా తీయగా కూడా ఉన్నాయి. కథ, కేవలం కథ కోసమే కాకుండా నీతి దాయకంగా, సాంస్కృతిదాయకంగా కూడా ఉన్నాయి.
ప్రపంచం త్వరత్వరగా మారిపోతున్న నేటి తరుణంలో సుబ్బలక్ష్మి గారి బాలకథలు పిల్లలకు ఆసక్తిని కలిగిస్తూ వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని భావిస్తున్నాను.
- డా. ఎన్. గోపి
