-
-
అమ్మ కథలు
Amma Kathalu
Author: Sammeta Umadevi
Publisher: Kaveerna Prachuranalu
Pages: 190Language: Telugu
సామాజిక అవాంఛనీయతని కథానికలో చిత్రిస్తూ చదువరిలో ఒక అలజడిని కలిగించగలిగితే ఆ కథానిక ఆలోచన ప్రేరకం అవుతుంది. ఆచరణకు చోదక శక్తిని కూరుస్తుంది. మనిషి సంస్కారాన్ని ఉన్నతీకరించటానికి దోహదపడుతుంది. ఉమాదేవి గారి కథానికలన్నిటా ఈ లక్ష్యశుద్ధి ద్యోతకమవుతుంది. దీనికి నిదర్శనంగా ఈ సంపుటిలోని సహాన, కమ్లి, అమ్మతల్లి లాంటి కథలు చదివితే చాలు. కథానికని ఎక్కడ మొదలెట్టి ఎలా నడిపి ఎక్కడ ముగించాలో తెలిసిన, శిల్ప పరిణతితో తన కథానికల్ని అనుభూతి ప్రదానం చేసిన దిట్ట ఉమాదేవి గారు. ఈనాటి సమాజంలోని సంక్లిష్టతని కథా దర్పణంలో చూపిన రచనల్ని ఈ సంపుటిలో చదివి ఆనందించండి.
- విహారి
* * *
కథలు అందరూ రాస్తారు. కాని మంచి కథలు కొందరే రాస్తారు. మంచి కథలు రాసే ఆ కొందరిలో సమ్మెట ఉమాదేవి ఒకరు. వారి కథలు బాగుంటాయి. బాగుండడమే కాదు, బాధపెడతాయి. బాధపెట్టి కన్నీళ్ళు రప్పిస్తాయి. ఈ కథా ప్రారంభాలు ఎంత బాగున్నాయో, కథాంతాలు అంతకు రెట్టింపు బాగున్నాయి. కథను కథగా చెప్పడం ఉమాదేవిగారికి బాగా తెలుసు. తెలిసినదంతా కథలో చెప్పాలనే తాపత్రయం ఆమెకు లేకపోవడమే ఈ కథలు ఇంతగా బాగుండడానికి కారణం అని నేను భావిస్తున్నాను. ఏది కథగా చెప్పాలో, చెప్పాల్సింది ఏ మేరకు చెప్పాలో చక్కగా తెలిసిన రచయిత్రి సమ్మెట ఉమాదేవి. అందుకు వారిని అభినందించక తప్పదు.
- జగన్నాధ శర్మ
అమ్మకు జేజేలు – “అమ్మ కథలు” పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=3946