-
-
అమ్మ చెప్పిన కథలు (బొమ్మలతో)
Amma Cheppina Kathalu Bommalato
Author: Karanam Annapurnamma
Publisher: Self Published on Kinige
Pages: 38Language: Telugu
ఈ చిన్ని పుస్తకంలో సంకలనం చేసినవి నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రుల, మా తాత ముత్తాతల వద్ద విన్నవి. అప్పట్లో కథల పుస్తకాల ప్రాచుర్యం అంతగా లేకపోవడంవల్ల, ఉన్నా పుస్తకాలు కొనే సామర్థ్యం లేకపోవడం కారణంగా మౌఖికంగానే తరతరాల పిల్లల మస్తిష్కాలలోకి వెళ్ళిపోయాయి. నా పిల్లలకు, నా మనుమలకు, మనుమరాళ్ళకు కూడా ఈ కథలు చెప్పాను. వీటిలో నీతి మాత్రమే ఇతివృత్తంగా ఉండడం కాదు, కొద్దో గొప్పో హాస్యం కూడా మిళితమై పిల్లల ఊహాశక్తిని పెంచడానికి ఉద్దేశించినవి ఉన్నాయి. నా ఉద్దేశంలో పిల్లలకు ఆరేళ్ళు వచ్చేవరకూ హాయిగా ఈ కథలు చెప్పొచ్చు. బాగా చెప్తే పదే పదే చెప్పిన కథనే చెప్పించుకోవటం అనుభవ పూర్వకంగా గ్రహించాను. వీటివలన ధారణాశక్తి పుష్కలంగా పెరుగుతుందంటే ఏ మాత్రం సందేహం లేదు.
తరతరాలుగా రాయలసీమ ప్రాంతంలో చెప్పుకు వస్తున్న ఈ కథల సమాహారాన్ని పుస్తకంగా పొందుపరచడం జరిగినది. చదివి సంతోషిస్తారని, పిల్లలకు చెప్పి వారి బుద్ధి కుశలతకు తోడ్పడుతారని ఆశిస్తున్నాను.
నేను చెప్పిన ఈ కథలను పుస్తక రూపంలో గ్రంథస్తం చేసిన నా కుమారుడు నాగరాజరావుకు నా ఆశీస్సులు.
- కరణం అన్నపూర్ణమ్మ
