-
-
అమెరి'కట్టు కథలూ - కమామీషులూ'
Amerikattu Kathalu Kamamishulu
Author: Dr. Vanguri Chitten Raju
Publisher: Vanguri Foundation of America
Pages: 144Language: Telugu
ఈ పుస్తకంలో ఉన్నవి కొన్ని కథలు - అంటే కాస్త వాస్తవం, మరికాస్త అవాస్తవాలూ కలబోసి వ్రాసినవి, మరికొన్ని ఆయా సందర్భాలని బట్టి వ్రాసిన కమామీషులు.. అంటే వ్యాసాలలాంటివి అన్నమాట. వీటిల్లో కొన్నింటికి కాలదోషం పట్టేసి అప్రస్తుతం అనిపించే అవకాశం ఉంది, అయినా మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి అన్నీ యథాతథంగానే ఉంచేశాను. ఇవన్నీ మా కాంతి & కిరణ్ ప్రభ సమర్థవంతంగా పదేళ్ళకి పైగా నిర్వహిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత జాలపత్రిక ‘కౌముది.నెట్’లో 2015-16 సంవత్సరాలలో ఇంచుమించు నెలకి ఒకటి చొప్పున ప్రచురించబడినవే. అంటే ఆప్పుడప్పుడు సమయానికి పంపించలేక నేను నెల తప్పాను అన్నమాట. ఆ మాట కొస్తే ‘కౌముది’ మొదటి సంచిక నుంచీ ప్రతీ నెలా హాస్య కౌముదిలో ఏదో నాకు తోచినది వ్రాయడం, కిరణ్ ప్రభ దంపతులు నవ్వుతూనో, నవ్వుకుంటూనో, నాకు తెలియకుండా ఇంకేమన్నా అనేసుకుంటూనో క్రమం తప్పకుండా అది ప్రచురిస్తూనే ఉండడం అలవాటు అయిపోయింది. పదేళ్ళుగా పాఠకుల ఆదరణ కూడా ఫరవాలేదురా అబ్బాయ్ అని గూగులమ్మ చెప్తున్నమాట.
- వంగూరి చిట్టెన్ రాజు

- ₹450
- FREE
- ₹65.004
- ₹60
- ₹108
- ₹108