-
-
అమెరికలకలం
Amerikalakalam
Author: Dr. Vanguri Chitten Raju
Publisher: Vanguri Foundation of America
Pages: 190Language: Telugu
ఈ చిన్న పుస్తకానికి ముందుమాట వ్రాయమని ఎవరైనా పెద్దవాళ్ళని అడుగుదామా అని ముందు అనుకున్నాను కానీ 'ఏమో, ఇందులో ఉన్నవి కథలో, వ్యాసాలో, వ్యాసకథలో, కథావ్యాసాలో అనుమానం వచ్చి కోప్పడతారేమో అని ఆ ప్రయత్నం విరమించుకున్నాను. అందుకే ఆ తంటాలు కూడా నేనే పడుతున్నాను. అసలు ఏ పుస్తకానికైనా ముందు మాట ఎందుకూ, దండగమాట అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో నాకు పెద్ద పేచీ లేదు. అంతా రచయిత ఇష్టాయిష్టాల మీదా, డబ్బు ఖర్చు పెట్టి ప్రచురించే వారి మీదా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రెండూ నేనే కాబట్టి... నా ఇష్టమే మీ కష్టం. కదా!
ఇందులో ఉన్న కొన్ని కథలు - నేను వాటిని కథలు అనే అంటాను - ఎందుకంటే అవి నిఝంగా నాకు జరిగిన అనుభవాన్ని బట్టి వ్రాశాను అని ఎవరైనా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కాస్తో కూస్తో జరిగినా అది కథ అల్లుకోడానికి ఉపయోగపడింది. ఎందుకో తెలియదు కానీ నాకు ఏదేదో ఊహించేసుకుని, దాన్ని 'కవి సమయం' అని పేరు పెట్టేసి, కాళ్ళకి గడ్డి పసరు వ్రాసుకుని హిమాలయాలకి వెళ్ళడం కంటే రోజువారీ చిన్నా, పెద్దా సంఘటనల లోంచే సరదా కథలు వ్రాసుకోవచ్చును కదా అనిపిస్తుంది. ఆ ప్రయత్నమే ఇందులో ఉన్న కథలలో కూడా చేశాను.
- వంగూరి చిట్టెన్ రాజు

- ₹450
- FREE
- ₹65.004
- ₹60
- ₹108
- ₹108