-
-
అమెరికా వంటింటి పద్యాలు
America Vantinti Padyalu
Author: Satyam Mandapati
Publisher: Sahitya Sourabham
Pages: 90Language: Telugu
ఈ పుస్తకంలోవి వంటింటి పద్యాలు కాబట్టి వీటిల్లో అన్ని రుచులూ ఉన్నాయి. తియ్యగా అనిపించేవి కొన్ని, చేదునిజాలని చెప్పేవి కొన్నీ, ఘాటుగా తగిలేవి మరికొన్నీ, కారంకారంగా నషాలానికి అంటేవి ఇంకొన్నీ - వెరసి అన్ని రుచులనీ అందించారీ పద్యాలు కాని పద్యాల్లో. అమెరికా వంటింటి నుంచి మొదలయ్యాయి కాబట్టి ముందులో సుబ్బారావు, అప్పారావు, నరసమ్మ అనే మూడు పాత్రలను పరిచయం చేసి, వాళ్ళ అమెరికా ప్రయాణ ప్రయత్నాలు, అమెరికా వచ్చాక తొలి అనుభవాలూ అందరికీ అన్వయించేలా చెప్పారు. మధ్యలో అనేక విషయాలని స్పృశించినా మళ్ళీ చివరలో ఈ ముగ్గురూ అమెరికాలో ఎలా జీవిస్తున్నారో చెప్పి ఈ పద్యాలను ముగించడం ఎంతో చక్కగా ఉంది.
ఎంత అమెరికాలో ఉన్నా మన దేశం గురించి ఆలోచించడం మానుకోలేం. మన వూరు వార్తాపత్రికలు చదవకుండా ఉండలేం. అందుకే ఈ పద్యాల్లో సగం దాటాకా సమకాలీన ఆంధ్రదేశంలోని రాజకీయాల మీద, మారిన జీవన విధానాల మీద, సినిమాల మీద చెణుకులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి పద్యానికీ పెట్టిన శీర్షికలు పాఠకులని ఆకట్టుకుంటాయి. దానిలో ఏముందో చదవాలన్న ఉత్సుకతని కలిగిస్తాయి. కొన్ని ఖండికలని గోపి బూరుగు వేసిన కార్టూనులు కూడా సందర్బోచితంగా ఉండి పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
- కిరణ్ ప్రభ
