• America Udyoga Vijayalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమెరికా ఉద్యోగ విజయాలు !

    America Udyoga Vijayalu

    Publisher: Sahitya Sourabham

    Pages: 128
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాకున్నవి రెండు అర్హతలు. ఒక ఆవేదన.

అందుకని ఈ వ్యాసాలు వ్రాశాను. ఇప్పుడు పుస్తకంగా తీసుకువస్తున్నాను.

ఆ రెండు అర్హతల్లో మొదటిది మూడు డిగ్రీల సంపాదన. రెండోది కేరళ, ఇండియాలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోనూ, అమెరికాలో వివిధ హైటెక్ కంపెనీల్లోనూ కలిపి పని చేసిన యాబై ఏళ్ళ నా ఉద్యోగ పర్వం. సెమీకండక్టర్ కంపెనీల్లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ పదవుల్లోనించీ ఆమధ్యనే విశ్రాంతి తీసుకుని, అలాటి కంపెనీల్లోనే కొంత కన్సల్టింగ్ కూడా చేశాను.

ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంటులో ఉద్యోగం చేస్తూ, మన దేశం నించీ వచ్చి ఉద్యోగాల్లో వున్న కొందరిని చూశాక, నాకొక ఆవేదన కూడా కలిగింది.

ఇండియానించీ విదేశాలకి వెళ్ళినవారేకాక ఇండియాలోనే కొన్ని విదేశీ కంపెనీల్లో ఉద్యోగ ప్రయత్నాల చేసేవారి రెస్యూమేలు చూశాను. ఇంటర్వ్యూల్లో ఎలా చేయాలి. ఉద్యోగ వాతావరణంలో, ముఖ్యంగా ఈ గ్లోబల్ చదరంగంలో అవసరమైన కమ్మూనికేషన్ సరిగ్గా లేకపోవటం, వివిధ గ్లోబల్ సంస్కృతుల్లో సరిగ్గా ఇమడలేక పోవటం మొదలైనవి చూశాక, నా సుదీర్ఘ అనుభవాలని వారితో పంచుకుని, నాకు తోచిన సహాయం చేయాలనిపించింది.. అందుకనే 'సుజనరంజని' అంతర్జాల పత్రికలో ఈ పన్నెండు వ్యాసాలు వ్రాశాను.

ఈ వ్యాసాలకి ప్రపంచం నలుమూలలా గొప్ప స్పందన వచ్చింది. ఇవి వ్రాస్తున్నప్పుడే కొంతమంది వారికి అవసరమైన కొన్ని విషయాలపై కూడా వివరంగా వ్రాయమని ప్రోత్సహించారు. వీటిని పుస్తకంగా తీసుకురమ్మని కూడా కోరారు.

వాటి ఫలితమే ఈ ఈ-పుస్తకం. ప్రస్తుతం దీన్ని అచ్చు పుస్తకంగా తీసుకురావటం లేదు.

ఈ వ్యాసాలని ఒక సంవత్సరంపాటు “సుజనరంజని"లో ప్రచురించిన సంపాదకులకు నమస్కారాలు.

అలాగే ఈ వ్యాసాలు చదివి, తమ స్పందన అందించిన పాఠకులందరికీ ధన్యవాదాలు.

మీ ఉద్యోగ విజయాల్లో, వ్యక్తిత్వ వికాసంలో, ఈ వ్యాసాలు ఏమాత్రం ఉపయోగపడినా ఈ పుస్తక రచనకు ఫలితం దక్కినట్టే.

- సత్యం మందపాటి

Preview download free pdf of this Telugu book is available at America Udyoga Vijayalu
Comment(s) ...

“సరదాగా చెప్పిన అద్భుతమైన మేనేజ్మెంట్ పాఠాలండి!” - SV
“మీరు, ఆబ్దుల్ కలాంగారితో కలిసి పనిచేశారని తెలిసి సంతోషంగా ఉంది. అలాగే, మీరు ప్రతినెలా చెప్తున్న ఉద్యోగ చిట్కాలు కొత్తగా ఉద్యోగంలో చేరిన, చేరబోతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇండియాలో తెలుగు నేలపై ఈ పుస్తకానికి ప్రచారం దొరికితే బాగుంటుంది” - MJT
“మేనేజ్మెంట్ సూక్తుల్ని మీ విలక్షణ శైలిలో అరటిపండు వలిచి పెట్టినట్లు చెప్పారు. మనలోని కార్యసాధక గుణగణాలను ఉపయోగించుకుంటే విజయం తధ్యమని చక్కగా చెప్పారు. ధన్యవాదాలు” - RC
“బావుందండీ. కుందేలుకుండేవి (కోర్ కాంపెటెన్సీలు) కుందేలుకు ఉంటాయి. తాబేలుకుండేవి (కోర్ కాంపెటెన్సీలు) తాబేలుకి ఉంటాయి. కలసివుంటే కలదు సుఖం. అదే టీం వర్క్. మా బాగా
చెప్పారు” - VC
“I used to think it is the resume that gets us the job. After reading your article, I could clearly understand the role of resume as only a tool to get the interview and it is the interview that gets s the job. I followed this two-step process during my last job search a few months ago, and I am happy to say it worked wonderfully well. Thank you” - KP
“Wonderful, very useful articles. Nice guidelines. Very practical. Thanks” - PJ