-
-
అమెరికా తెలుగు కథానిక - పదవ సంకలనం
America Telugu Kathanika Volume 10
Author: Multiple Authors
Publisher: Vanguri Foundation of America
Pages: 253Language: Telugu
సాహిత్యం సమాజానికి ఒక దర్పణంలా ఉపయోగపడుతుందంటారు. ప్రవాసాంధ్రుల రచనలకున్న ఒక ఉపయోగం అటువంటిదే. భాష ఒక చెట్టులాంటిదయితే, చెట్టున కాసే ఫలపుష్పాలు సాహిత్యం లాంటివి. ఆ చెట్టుని సంరక్షించుకుంటేనే మనకి సాహిత్య ఫలం కాస్తుంది. ప్రవాసాంధ్రులు తమ భాషా సంస్కృతులను కాపాడుకుని అనుభవించటానికి అనేక మార్గాలు అవలంబిస్తారు. వారిలో రచయితల కృషి చెప్పుకోవలసినది, అభినందించవలసినది. దేశం వదలి వెళ్ళినా తమ చరిత్రను, తమ సంస్కృతిని మరిచిపోని రచయితలు ఈ సంకలనంలో పరిచయమవుతారు. గత ఐదు దశాబ్దాలలో అమెరికా వలస వచ్చి స్థిరపడినవారి జీవితాలలో జరిగిన రకరకాల సంఘటనలు, వారెదుర్కొన్న సమస్యలు, వాటి పరిష్కారాలు - ఇవన్నీ మామూలు కబుర్లలో కాక తూచి, విలువ కట్టి, సంస్కరించి తమ మాతృభాషలో సమకూర్చిన పలువురి రచనలు ఈ సంకలనంలో చేకూర్చబడ్డాయి.
కొత్త కొత్త అనుభవాల వల్ల తమలో దాగివున్న నిజస్వరూపాన్ని గ్రహించుకున్న వ్యక్తుల గురించి వ్రాసిన కథలున్నాయి. ప్రేమానురాగాలతో పెంచి పెద్దవారిని చేసిన తమ పిల్లలు తమకు తెలియనివీ, కని విని ఎరుగనివీ వింత త్రోవలు పట్టుతున్నందుకు తట్టుకుని (తట్టుకోలేక) మసలుకుంటున్న తల్లిదండ్రుల గురించి కొందరు వ్రాశారు. కొత్తగా ఈ మధ్యనే అమెరికా వచ్చి పాత అలవాట్లు మరిచిపోలేక, కొత్త పరిస్థితులకి అలవాటుపడక సతమతమవుతున్న నూతన ప్రవాసాంధ్రుల గురించి కొన్ని కథలున్నాయి. ప్రవాసంలో పునాదులు కట్టుకోలేక ఆత్మపరిశోధనతో అనుభవాలకి అర్థం వెతుక్కుంటున్న వారి గురించి కొన్ని కథలు. జెండరు ఐడెంటిటి డిసార్డర్, హోమో సెక్సుయాలిటీల గురించి సున్నితంగా, భావగర్భితంగా వ్రాసినవారున్నారు. అమెరికా సాంఫిుక రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషిస్తూ కల్పించిన విమర్శనాత్మక రచనలు కొన్ని. ఇందులో ముప్ఫై అయిదు కథలున్నాయి - వంగూరి ఫౌండేషన్ నిర్వహిస్తున్న కథల పోటీలకు వచ్చిన కథలూ, ఈమాట, కౌముది, తెలుగుజ్యోతి పత్రికలలో ఇదివరకే ప్రచురితమైన కథలూ - ప్రవాసాంధ్రుల జీవితాలకి అద్దం కట్టి చూపించిన సృజనాత్మక రచనలు.
- పెమ్మరాజు వేణుగోపాలరావు

- FREE
- FREE
- ₹180
- ₹270
- FREE
- FREE