-
-
అమెరికా తెలుగు కథా సాహిత్యం - ఒక సమగ్ర పరిశీలన
America Telugu Kathaa Saahityam Oka Samagra Pariseelana
Publisher: Vanguri Foundation of America
Pages: 298Language: Telugu
అమెరికాలోని తెలుగువారి జీవితాలలో తారసపడే పరిస్థితులను, సమస్యలను ప్రతిబింబిస్తూ అక్కడి నుండి వెలువడుతున్న అమెరికా తెలుగు కథా సాహిత్యం నూతన తరానికి తెరతీసింది. అమెరికాలోని తెలుగువారి జీవనశైలికి అద్దం పడుతూ, అక్కడి నుంచి వెలువడుతున్న సాహితీ ప్రక్రియల్లో కథా ప్రక్రియ అగ్రగామిగా నిలిచింది. అమెరికాలోని తెలుగువారి జీవితాలని గూర్చి తెలుసుకోవాలనుకునే వారికి అమెరికా కథా సాహిత్యం ముఖ్య భూమికగా నిలుస్తుంది. అమెరికాలో తెలుగువారి జీవితాన్ని అమెరికా తెలుగు కథా సాహిత్య పరిశీలన ద్వారా ఈ పరిశోధన సిద్ధాంత వ్యాసం కొత్త కోణం ఆవిష్కరించింది.
ఈ గ్రంథంలో కథావస్తువుని ఆధారంగా చేసుకుని కథా సాహిత్యాన్ని 18 విభాగాలుగా విభజించి, విశ్లేషించిన తీరు బాగుంది. ఈ 18 విభాగాలలో లేని కొన్ని కథలను ప్రత్యేకంగా విశ్లేషించి ఆ కథల ప్రత్యేకతలను వెల్లడించడం జరిగింది. అలాగే భారతీయ నేపథ్యంలో కొందరు కథా రచయితలు - రచయిత్రులు వ్రాసిన కథా సంకలనాలను సైతం విశ్లేషించడంతో ఈ గ్రంథానికి సార్థకత చేకూరింది.
ఈ గ్రంథం అనేకమంది తెలుగు కథకులను - వారి కథలను సాహిత్య లోకానికి పరిచయం చేస్తుంది. ఈ గ్రంథం అమెరికా తెలుగు కథా సాహిత్యం యొక్క విలువను లోకానికి చాతి అమెరికా తెలుగు కథకు గౌరవాన్ని పెంపొదిస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఇది అమెరికా తెలుగు సాహిత్యంపై వచ్చిన తొలి పరిశోధన అనే విషయాన్ని గుర్తుంచుకొని చర్చలను - విమర్శలను నలుదిశలా కొనసాగిస్తే బాగుంటుంది.
- గుజ్జర్లమూడి కృపాచారి
