• America Nanilu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమెరికా నానీలు

    America Nanilu

    Publisher: Reya Publications

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమెరికా వెళ్లాచ్చిన వారిలో రెండురకాలుగా వుంటారు. మనదేశంతో పోల్చి అమెరికాను భూతలస్వర్గంగా ప్రశంసించేవారు, అక్కడి మంచిచెడులను నిష్పక్షపాతంగా చూపించేవారు. ఈ నానీలు రెండోరకానికి చెందుతాయి. దీనికి మేధోపరమైన అవగాహన, గ్లోబల్ విజ్ఞానం అవసరం. అమెరికానానీల కవి హర్షవర్ధన్‌గారికి ఇవి పుష్కలంగా వున్నాయి. అందుకే అమెరికా చుట్టూ అల్లుకున్న గ్లామర్ పొరలను తొలగించి అక్కడి జీవనసరళిని బ్లాక్‌అండ్‌వైట్‌లో చూపెట్టారు.

- డా.ఎన్.గోపి

అమెరికా చూసొచ్చిన వారందరు అక్కడి విశేషాలను అపురూపంగా ముచ్చటించుకుంటారు. ఈ కవి వర్థనులు మాత్రం ఆ అపురూపతెరల వెనుకనున్న కొన్ని యధార్థాలను నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేసారు. ఇలా కవిత్వరూపంలో యాత్రానుభవాలను, విశేషాలను చెప్పడం కష్టమైన విషయం. ఆయా ప్రదేశాల సమాచారంతోపాటు వాటికి కవితాస్పర్శను అద్దడం అనుభమున్న కవితాకారులకు మాత్రమే సాధ్యం. కాని హర్షవర్ధన్‌గారు చూసిన దృశ్యంలోంచి కొత్త ఆలోచన చేయడమేగాకుండా అనుభూతి కలిగేలా చెప్పడం అభినందనీయం. ఆయా విషయాలకు అవసరమైనంత మోతాదులో కవిత్వ పెప్పర్‌ను చల్లారు.

- డా. ఎస్.రఘు

***


ఇక్కడ మిత్రులు
ఫోన్‌లెత్తరు
ఇండియా మిత్రులు
ఫోన్ దించరు.


అమెరికా గ్రంథాలయాలు
వలసపోయిన
మన సరస్వతీ
నిలయాలు.


మన వూళ్ళో
తినుడు, పండుడు
ఇక్కడ వాటికి తోడు
తోముడు, కడుగుడు.


దేవుళ్ళూ, భక్తులూ
ఇక్కడ శ్రీమంతులే
కనుక డ్రైఫ్రూట్సే
ప్రసాదాలు.


అగ్ర రాజ్యం
అందర్నీ భయపెడుతుంది
అందుకే భయం నీడలో
బ్రతుకుతుంది.

గమనిక: " అమెరికా నానీలు " ఈబుక్ సైజు 7mb

Preview download free pdf of this Telugu book is available at America Nanilu