• Amedi Ontari Poratam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఆమెది ఒంటరి పోరాటం

  Amedi Ontari Poratam

  Pages: 165
  Language: Telugu
  Rating
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  '3/5' From 1 votes.
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  '3/5' From 1 premium votes.
Description

వణుకుతున్న చేతిని భయం భయంగా అతనికి అందించంది మల్లీశ్వరి. పెదవులు కూడా అదురుతున్నాయి.

తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆమెకా సమయంలో.

''నువ్వు చాలా కాన్ఫిడెంట్‌గా కనబడాలి మల్లీశ్వరీ... నువ్వు చేసే ఏ పనయినా సరే భయంతో బాధతో వున్నప్పుడయినా సరే ఏ పని చేస్తున్నావు... ఎలా ... ఎంత గొప్ప టాలెంట్‌తో చేయబోతున్నావన్నది ముఖ్యం కాదు... నువ్వు నీ ఎదుటివాళ్లను ఏ పనైనా నువ్వు చేయగలవని నమ్మించలేకపోయావో, నీ పనిలో నువ్వు అపజయం పాలుకాక తప్పదు.''

గుర్తుకొచ్చి కాస్త తనని తాను కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నించింది.

అంతలో వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తొకొచ్చాయి. "నువ్వు భయపడ్డా, అది అవతలి వాళ్ళకు తెలియనివ్వకు. లేకపోతే నీ పనంతా పాడవుతుంది. వాళ్ళు నీ బలహీనతని అడ్డు పెట్టుకుని లాభపడతారు. భయం నీ వర్క్‌ని నాశనం చేస్తుంది."

గుర్తుకొచ్చిన ఆమెకు రాణా చెయ్యి వేడిగా, డ్రైగా తగలడంతో ఈ లోకంలోకొచ్చింది. ఆ షేక్‌హ్యాండ్ ఇవ్వటమే అనవసరమయిన దానికంటే ఎక్కువసేపే అమె చేతిని తన చేతిలో వుంచుకుని ఇచ్చాడతను.

కానీ అతనేం పట్టించుకోనట్టు, చాలాకాలం స్నేహం వున్న పాత ఫ్రెండ్‌ని కలిసినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆమెని చూసి నవ్వాడు.

అతని అనుచరులకే భయం వేసింది ఆ నవ్వు చూసి.

Preview download free pdf of this Telugu book is available at Amedi Ontari Poratam