-
-
ఆమె ఎవరు?
Ame Yevaru
Author: Satish
Publisher: Self Published on Kinige
Pages: 142Language: Telugu
“బాస్ ఆ రాముగాడే దొంగ అని ఎలా కనిపెట్టావు” అడిగాడు రాజు
“వాడు కొత్తగా మా బాచ్లో చేరాడు.
ఒకసారి సురేష్ కాల్చిన సిగరెట్ ముక్కలు బయట పడేస్తాను అని తీసుకు వెళ్ళడం నేను కూడా చూసాను.
నిన్న కూడా అలాగే చేసాడు, వాడు ఎందుకు తీసుకుని వెళుతున్నట్లు అని నాకు అనుమానం వచ్చింది. వాడి రూము మేట్సు వీడిని లేజీ ఫెలో అంటూ ఉంటారు, అందుకని వాడి రూముకి వెళ్ళాం, నాలుగు తగిలిస్తే అసలు విషయం అంతా మొత్తం చెప్పేసాడు, నువ్వు కూడా వచ్చావు కదా! ఇక్కడ మీకు ఎవరికీ తెలియకుండా ఉన్న అసలు విషయం ఏమిటి అంటే వాడికీ, ప్రకాష్ గాడికి పడదు, ఒకప్పుడు ప్రకాష్, రాము మంచి స్నేహితులే, కానీ ఒకసారి వచ్చిన చిన్నమాట పట్టింపు పెద్దదిగా మారి, వారి మధ్య స్నేహం చెడింది. ఎలాగైనా రాము తన పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అందుకని ప్రకాష్ గాడి చెల్లెలిని బద్నాం చెయ్యాలని అనుకుంటే తనే బద్నాం అయ్యాడు.
