-
-
ఆమె నడిచే దారిలో...
Ame Nadiche Daarilo
Author: T. Srivalli Radhika
Publisher: Self Published on Kinige
Pages: 74Language: Telugu
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. హైదరాబాద్ నడిబొడ్డున వున్న విశాలమైన మైదానం.
ఆ మైదానంలో రెండు కాలేజీలున్నాయి. రెండూ ఆడపిల్లల కాలేజీలే. చాలా ఏళ్ళ చరిత్ర ఉన్న కాలేజీలే. ఒకటి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్. రెండోది వనితా కాలేజ్.
అంజలీ, చిత్రా, మాధవి అక్కడే చదువుతున్నారు.
అవడానికి ప్రాణస్నేహితులే అయినా ముగ్గురి రూపాలలోనూ... ప్రవర్తనలోనూ బోలెడంత వ్యత్యాసం.
చిత్ర చాలా నెమ్మదిగా వుంటుంది. తెల్లటి రంగు. పెద్ద పెద్ద కళ్ళు. ఒక అమ్మాయి బొమ్మ గీయాలంటే ఏ చిత్రకారుడి కళ్ళముందైనా బహుశా చిత్ర లాంటి అమ్మాయే మెదులుతుందేమో! వంకలేని అందం ఆమెది. ఆ అందాన్ని కళ్ళార్పకుండా చూడటానికి ఒక జీవితం చాలదేమోననిపిస్తుంది.
అంజలిలో అందం కన్నా ఆకర్షణ ఎక్కువ. అల్లరి ముందు పుట్టి తర్వాత ఆ అమ్మాయి పుట్టి వుంటుంది. ఎంత సీరియస్గా వున్న పరిసరాలైనా అంజలి వచ్చిందంటే చాలు నవ్వులతో నిండిపోతాయి. ఏ విషయమూ పెద్ద సమస్యగా తోచదు ఆ అమ్మాయికి. సరదా అనే మాటకి ప్రతిరూపంలా కనిపించే ఆ అమ్మాయి సమక్షంలో ఎన్ని గంటలు గడిపినా అసలు సమయమే తెలీదు.
ఇక మాధవి చాలా చురుకైన అమ్మాయి. వాళ్ళిద్దరికన్నా తెలివైనది. విపరీతంగా పుస్తకాలు చదువుతుందేమో ... ఆ తేజస్సు ఆమె కళ్ళల్లో సదా ప్రతిఫలిస్తుంటుంది. ఏ విషయం గురించైనా కనీసం పదినిమిషాలు అనర్గళంగా మాట్లాడగలదు. సన్నగా, నాజూగ్గా, చురుకైన కళ్ళతో ... ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఆరాటంతో వుండే ఆ అమ్మాయిని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఆ జ్ఞాన తృష్ణని చూస్తే ఆరాధన కలుగుతుంది.
విడివిడిగానే మనుషులని గొప్ప ఆకర్షణ వలయంలో చుట్టేయగల ఆ ముగ్గురూ కలిసి వచ్చారంటే యిక కళ్ళు తిప్పుకోవడం కష్టం.
ఇలాంటి మూడు విభిన్న వ్యక్తిత్వాలున్న అమ్మాయిలని ఆకర్షించగలిగిన అందమైన యువకుడు .. అతని చేత ఆరాధించబడిన అపురూపమయిన అమ్మాయి…
ఎగ్జిబిషన్ నేపథ్యంగా సాగే అందమైన ప్రేమ కథ "ఆమె నడిచే దారిలో..."
"ఆమె నడిచే దారిలొ " చదివినంతసేపు ఓ చల్లని వేసవి సాయంత్రం నదీ తీరం లో నడిచిన అనుభూతి కలిగింది. నవల హాయిగా ఉంది.