-
-
అంబేడ్కర్ తత్వ శాస్త్రం
Ambedkar Tatva Sastamu
Author: Katti Padma Rao
Publisher: Lokayata Prachuranalu
Language: Telugu
'అంబేడ్కర్ తత్వ శాస్త్రం'
కత్తి పద్మారావు
' అంబేడ్కర్ తత్వశాస్త్రం' అనే గ్రంథం లోతైన పరిశీలన నుండి వచ్చిన గ్రంథం. రచయిత జాతి వైతాళికుడు, సామాజిక భాషా శాస్త్రవేత్త, మేథావి, తత్వవేత్త, కవి, బోధకుడు అవ్వడం వల్లనే ఇంతటి శక్తివంతమైన గ్రంథాన్ని రాయగలిగారు
ప్రపంచాన్ని మార్చిన సోక్రటీస్, ప్లేటో, బుద్ధుని తత్వశాస్త్రాలతో అంబేడ్కర్ తత్వశాస్త్ర తులనాత్మక పరిశీలన ఇందులో చేయబడింది. ఈ గ్రంథంలో సమకాలీన జీవన దర్శనం, తత్వబోధ, వ్యక్తిత్వ నిర్మాణం, సామాజిక తాత్విక విప్లవ సమన్వయం పాఠకుడిని ప్రపంచ వ్యక్తిత్వానికి పెంచి మహోన్నతుడిగా తీర్చిదిద్దుతుంది. రచయిత ఈ గ్రంధరచన కోసం చేసిన శ్రమ, పరిశోధన, రచనా శిల్పం, ఉజ్వలమైనవి. ఒక తాత్వికుడు ఇతర తత్వవేత్తల గురించి రాయగలడని పద్మారావు ఈ రచనలో నిరూపించారు
కత్తి పద్మారావుది ఇది నలభైవ గ్రంథం, కవిత్వం, సామాజిక శాస్త్రం, చరిత్ర, తత్వశాస్త్రం, సాహిత్య విమర్శ ఆయన రాస్తూ వచ్చారు. వాటన్నింటి సారం ఇందులో ద్విగుణీకృతమైంది. ముఖ్యంగా సామాజిక విప్లవోద్యమంలో మూడు దశాబ్దాలుగా ఒక సజీవ శక్తిగా ఆయన పనిచేస్తున్నారు. ప్రపంచ దళిత మహాసభలకు మలేషియాలో కౌలాలంపూర్ (1998), హౌసాఫ్ కామన్స్‌లో అంబేడ్కర్ శతజయంతి ఉత్సవాలకు లండన్ (1999), మానవహక్కుల పోరాట సభలకు దక్షిణాఫ్రికాలోని డర్బన్ (2001)లలో పయనించి, సభలలో పాల్గొని, ఎన్నో విలువైన గ్రంథాలు సేకరించారు. భారతదేశంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆ అనుభవసారం ఈ గ్రంథంలో వుంది.
పద్మారావు ఎన్నో పోరాటాలు నిర్వహించారు. సామాజిక పరిణామం కోసం, తాత్విక విప్లవం చేసే ప్రతి కార్యకర్తకి, మేథోసంపన్నతను పెంచుకునే ప్రతి చదువరికి వ్యక్తిత్వాన్ని సజీవంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ గ్రంథం ఒక సాధనంగా ఉపకరిస్తుంది. ఈ దశాబ్దంలో వచ్చిన గ్రంథాల్లో ఉన్నతమైన వాటి పంక్తిలో ' అంబేడ్కర్ తత్వశాస్త్రం' నిలుస్తుందని ప్రామాణికంగా చెప్పవచ్చు.
"