• Amba Paluku 2
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంబపలుకు : 2

    Amba Paluku 2

    Pages: 93
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతని రచనలలో ప్రతి ఫలించాలని నేను ఆశిస్తున్నాను. అయితే చాలా పర్యాయాలు కవి వ్యక్తిత్వానికి, కవిత్వానికి మధ్య ఒక అగాథం ఉండడం గమనించాను. దీనికి మినహాయింపు ఈ పుస్తకం.

శ్రీ మురుగన్ గారితో నాకు చాలా ఏళ్ళ నుండి వ్యక్తిగత పరిచయం ఉన్నది వారు ముందు, ఇప్పుడు ఒకే రకమైన మానసిక బలంతో ఉన్నారు. అది అసాధారణమైన విషయం అందరికీ సాధ్యం కాదు. ఈ పుస్తకంలోని కవిత్వం ఆయన మానసిక దృఢత్వాన్ని, ప్రాపంచిక దృక్పథాన్ని, సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. చాలా లోతైన భావజాలంతో సులభమైన భాషతో కవిత్వాన్ని నడపడం అందరికీ సాధ్యం కాదు.

కానీ శ్రీ మురుగన్ గారు కవిత్వాన్ని వ్రాయడం తనకు చేయి తిరిగిన పనిగా చూపించారు. ఒక తల్లి వద్ద పిల్లవాడు తనకు కావలసిన వస్తువుల కోసం మారాం చేసినట్లు, తన అప్పు వసూలు చేసుకోవడానికి ఒక వ్యక్తి మరో వ్యక్తిని నిలదీసినట్లు ఇందులో కవిత్వం కనిపిస్తుంది.

ఇలా కవిత్వం రాయాలంటే అమ్మవారితో ఎంతో సాన్నిహిత్యం ఉండాలి. శ్రీ మురుగన్ గారు గొప్ప సాధకులు. వారి సాధన లోక కళ్యాణం కోసమే కానీ స్వార్థం కోసం కాదు, ఈ కవిత్వం ఒక స్తోత్రం కూడా!

దీన్ని శ్రద్ధగా చదివినవారికి జీవిత దృక్పథం మారిపోతుంది, భక్తి తత్వం అలవడుతుంది, బ్రతుకు పరమార్థం బోధపడుతుంది, వ్యక్తిత్వం వికసిస్తుంది, మనసు దృఢము అవుతుంది.

దసరా కానుకగా ఈ లోకానికి శ్రీ మురుగేశన్ గారు అందిస్తున్న ఈ "అంబ పలుకు" జగదంబ ఆశీర్వాదం గా వెలుగొందుతుంది. అందుకోండి .

- ఆముదాల మురళి

Preview download free pdf of this Telugu book is available at Amba Paluku 2