-
-
అమావాస్య తార
Amavasya Tara
Author: Athaluri Vijayalakshmi
Pages: 96Language: Telugu
తిరిగి చెన్నై వచ్చాక శ్రేయ గుండెల్లో భయం అనే పాము తిరిగి నిద్ర లేచింది.... నాలుగు రోజుల్లో ఇంట్లో ఏవో మార్పులు కనిపించాయి. బలవీర్కి, తోడు కోసంట ఇంకెవరో వ్యక్తి ఉన్నాడు.... కండలు తిరిగిన శరీరం, పెద్ద మీసాలు, ఎర్ర జీరలున్న కళ్ళతో చూడగానే గుండెల్లో డైనమేట్లు పేలేలా ఉన్న అతడిని చూసి అడిగింది... "బలవీర్... ఎవరితను?"
"మా పెద్దమ్మ కొడుకు... ఊరినుంచి వచ్చాడు... కొన్ని రోజులు ఉంటాడు... నాకు తోడుగా... మీరేం జీతం ఇవ్వనక్కరలేదు..." అన్నాడు...
శ్రేయ మండిపడింది.... "నాకు చెప్పనవసరం లేదా? ఇలా ఎవర్ని పడితే వాళ్ళని తీసుకురావడానికి ఇది ధర్మసత్రమా?"
"తిలక్ బాబుగారిని అడిగానమ్మా.."
"తిలక్ ఎవరు? ఇది నా ఇల్లు.. ఇంకోసారి తిలక్ అంటే మాత్రమ్ ఊరుకునేది లేదు.. వెంటనే అతడిని పంపించెయ్..." విసవిసా లోపలికి వెళ్ళిపోయింది...
"మీరలా బైట పడకండి... మంచిగా ఉంటూనే మనక్కావలసింది సాధించుకోవాలి..." ఓదార్పుగా అంది వందన..
"నాలో సహనం చస్తోంది వందనా!" జాలిగా నిస్సహాయంగా అంది.
