• Amarakosam
  • Ebook Hide Help
    ₹ 388.8
    432
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమరకోశం

    Amarakosam

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 1034
    Language: Telugu
    Rating
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    '4.60/5' From 5 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

‘అమరం చదవని వానికి నేను అమరను’ అని సరస్వతీ దేవి వచనంగా ప్రచారంలో ఉన్న 'నామలింగానుశాసనం' అనే నిఘంటువు సుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా భారత భూమిలో ప్రచారంలో ఉన్నది. సంస్కృతం నేర్చుకొనే ప్రతి విద్యార్థి అమరం వల్లెవేయటం ప్రాథమికమని భావించబడిన మహా గ్రంథం ఇది. ఆయుర్వేద మహాశాస్త్రవేత్త ధన్వంతరి కూడా ఈ నిఘంటువును రచించాడంటే ఈ నామలింగానుశాసనం యొక్క విశిష్టతను తెలుసుకోవచ్చు.

’నామలింగానుశాసనం’ రచించిన అమరసింహుని పేరు మీదనే ఈ నిఘంటువు అమరకోశం అని ప్రాచుర్యం పొందింది. పదిహేను వందల సంవత్సరాల క్రిందటే చైనా భాషలోనికి కూడా అనువాదం పొందిన నిఘంటువు ఇది. అమరకోశం తనకు పూర్వం రచింపబడిన నిఘంటువుల నడుమ మహోజ్జ్వలమై నాటికీ నేటికీ ప్రకాశించే కోశరత్నం.

అమర కోశానికి సంస్కృత ప్రచారానికీ శాశ్వతమైన అవినాభావ సంబంధం ఏర్పడింది. ఈనాటికీ ప్రతి సంస్కృత విద్యార్థి ’యస్యజ్ఞాన దయా సింధో’ అనే ప్రార్థనా శ్లోకంతో మొదలుపెట్టి సంస్కృత అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ విధంగా అమరకోశం సంస్కృత వాఙ్మయంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకొన్న విషయం యథార్థం.

అలాంటి అమరకోశాన్ని లింగాభట్టియం అనే టీకా సర్వస్వంతో కలిపిఉన్న గురుబాల ప్రబోధికా వ్యాఖ్యతో ప్రస్తుతం సమర్పిస్తున్నాము. ఇది తెలుగువారికి కల్పవృక్షమై భాసిల్లాలని మా కోరిక.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Amarakosam
Comment(s) ...

unable to download the ebook after purchasing...

the preview's option on kinige are bad. we can't judge a book by just seeing some first 10 pages.
at least the contents have to be present and 5-10 pages of the 1st or 2nd chapter also have to be there.

Could you please give rent option for the ebook?

please provide rent option also..

Please make the print copy available.

Thanks a lot!! Iam going to buy this ebook. Thanks Victory publishers. You Rock

Please post ebook of this. I would like a ebook please.