-
-
అమరజీవి బలిదానం - పొట్టి శ్రీరాములు పోరాటగాథ
Amarajeevi Balidanam Potti Sriramulu Porata Gatha
Author: Nagasuri Venu Gopal
Pages: 268Language: Telugu
ఆంధ్రరాష్ట్రం, భాషాప్రయుక్త రాష్ట్రాలు అనగానే బాగా గుర్తుకు వచ్చే పేరు పొట్టి శ్రీరాములు. 2003 మార్చి 3వ తేదీన ప్రముఖ చరిత్రకారులు రామచంద్రగుహ ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో “Sadly, outside Andhra he is a forgotten figure now…” అని వ్యాఖ్యానించారు. తెలుగు వారికి కూడా పాఠ్యపుస్తకాలలో చదువుకున్న విషయాలే తప్పా వివరమైన పుస్తకం అందుబాటులో లేదు. ఈ లోటును పూరిస్తూ డా. నాగసూరి వేణుగోపాల్ తన సంపాదకత్వంలో ‘అమరజీవి బలిదానం - పొట్టి శ్రీరాములు పోరాటగాథ’ పేరున అమూల్య చారిత్రక అంశాలనూ సంకలనం చేశారు. ఏ కారణంతో పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి సిద్ధపడ్డారు? వారి మదరాసు జీవిత నేపథ్యం, బొంబాయి ఉద్యోగ జీవితం, గాంధీ మహాత్మునికి సాన్నిహిత్యం మొదలైన విషయాలతోపాటు నెల్లూరు కేంద్రంగా చేసిన దళితసేవ, వివిధ నాయకులతో అనుభవాలు, బలిదానానికి వేదిక అయిన చెన్నపట్నం తెలుగు మూలాలు - వంటి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో బోధపడతాయి. టంగుటూరి ప్రకాశం, బులుసు సాంబమూర్తి, ఎ. సుబ్బరాయగుప్త, వై.ఎస్.శాస్త్రి, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ఇంకా జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్, జస్టిస్ ఆవుల సాంబశివరావు, ఎం.జె. అక్బర్, రామచంద్ర గుహ వంటి వార్ల విలువైన రచనలు ఈ సంకలనంలో గుదిగుచ్చారు డా. నాగసూరి వేణుగోపాల్, చరిత్రను గౌరవించేవారూ, తమ మూలాలు తెలుసుకోవాలనుకునే వారూ తప్పక కొని, చదివి దాచుకోదగిన పుస్తకం.
- మేడిశెట్టి తిరుమల కుమార్
(కవి, రచయిత మరియు రిటైర్డ్ ఛీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్కంటాక్స్)

- ₹135.6
- ₹216
- ₹270
- ₹60
- ₹162
- ₹216