-
-
ఆలోకన 2
Alokana 2
Author: Neelamraju Lakshmi Prasad
Publisher: Vidyarthi Mitra Prachuranalu
Pages: 166Language: Telugu
ఆ భిక్షుకుని తేజస్సుకు రాజే అసూయ చెందాడు. "ఏం కావాలి?" అని అడిగాడు.
"ఈ భిక్షాపాత్రను నింపడి" అన్నాడు భిక్షుకుడు.
"దేంతో నింపమంటారు? నేను రాజును, వజ్రాలతో నింపగలను" అన్నాడు రాజు.
"ఏవైనా ఫరవాలేదు, కానీ, అంచుల దాక నింపడం మరవకండి" అన్నాడు భిక్షుకుడు.
రాజు తన ధనాగారం నుంచి వజ్రాలు తెప్పించాడు. వేసిన వజ్రాలు వేసినట్టే మాయమౌతున్నాయి. రజు వద్ద నున్న వజ్రాలన్నీ అదృశ్యమయ్యయి కానీ భిక్షుకుని పాత్ర మాత్రం ఖాళీగానే ఉంది.
రాజు భిక్షుకుడి కాళ్ళపైబడి "మీరెవరో అసాధారణపురుషులు. ఈ భిక్షాపాత్రలో ఏమి మహత్తు ఉందో తెలియడం లేదు. దీనిని దేంతో నిర్మించారో చెప్పండి" అని వేడుకున్నాడు.
"దీనిని మనిషి పుర్రెతో నిర్మించాను రాజా! అందువలననే దీనికి అసలు తృప్తి అంటూ లేదు. అన్నింటినీ దిగమ్రింగి, మరికొన్నింటికై ఎదురు చూస్తూ ఉంటుంది" అన్నాడు భిక్షుకుడు.
* * *
మానవుని మనస్సు, మేధస్సుల గూర్చి ఇంత లోతైన చింతన గావించిన మహాపురుషుల బోధనలెన్నో...
నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి ద్వారా మనకు...
- ప్రచురణకర్తలు

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162
- ₹60
- ₹64.8
- ₹60
- ₹60
- ₹60
- ₹60