-
-
ఆలోచన అమృతం
Alochana Amrutham
Author: T. Srivalli Radhika
Publisher: Pramatha Prachuranalu
Pages: 172Language: Telugu
ఇదేం చిత్రం! ఈ రోజుల్లో కూడా యిలా భర్తా, పాతివ్రత్యమూ అంటూ మాట్లాడే స్త్రీలున్నారా! పతివ్రతల కథలలోని అసహజతని ఎంజాయ్ చేసేవాళ్ళున్నారా!
వైదేహి ఇదంతా మనస్పూర్తిగా అంటోందా! లేక కళ్యాణ్‌ని సంతోషపెట్టేందుకు యిలా నటిస్తోందా! నటన మాత్రం ఎలా సాధ్యం! ఒకరోజా! రెండు రోజులా! ఒక మనిషిని సంతోషపెట్టేందుకు జీవితమంతా నటించడం అసలు సాధ్యమా!
సాధ్యాసాధ్యాల మాట అలా వుంచి అసలెందుకలా వ్యక్తిత్వాన్నే మార్చుకోవడం! ఇంత చదువకునీ ఆలోచన లేకుండా బ్రతకడమెందుకు! భర్త చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా సమర్థించడమెందుకు!
ఎందుకంటే.. అందులోనే ఆనందం వుంది. జీవన మాధుర్యం వుంది అంటునారు భార్యాభర్తలిద్దరూ తడుముకోకుండా.
ఇక లాభం లేదని సూటిగా అడిగంది కమల. “ఇదివరకు రోజుల్లో వేరు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చదువకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకీ ఆలోచన వుంది. వాళ్ళు పూర్వకాలం పతివ్రతల్లా ఎలా బ్రతగ్గలరు!”
“బ్రతగ్గలరు అని నేను చెప్పడం లేదు. కానీ అలా బ్రతకడంలో ఆనందం వుంది అంటున్నాను.”
“అదే ఎలా! ఆనందం ఎలా వుంటుంది! భర్త చెప్పేది మూర్ఖంగా వున్నా, తర్కానికి అందకపోయినా ప్రశ్న లేకుండా అనుసరించడంలో ఆనందం ఎలా వుంటుంది!”
