-
-
అల్లుడుగారు ఆంధ్రా స్పెషల్
Alludugaru Andhraa Special
Author: Nandula Venkateswara Rao
Publisher: Self Published on Kinige
Pages: 92Language: Telugu
"చూడు చిట్టితల్లీ శ్రద్ధగా విను. పులిహోరల్లో రకాలు పదహారు. అందులో అసలు శాస్త్రోక్తమైన విధానం చింతపండు ఉడికించి, ఆ గుజ్జు కలిపి, ఆవపెట్టి కలిపే పులిహోర. ఇది వేడిచేస్తుందని అనాగరికుల వాదన. నిమ్మకాయలు పిండి చేసేది రెండో పులిహోర. మంచి నిమ్మపళ్ళు తొక్క నలగకుండా రసం తీసి ఆ రసం అన్నంలో కలపాలి. పులిహోర పోపుతోపాటు కొద్దిగా ఉప్పుగల్లు మధ్యమధ్య పంటికి తగలాలి. ఇక్కడ ముఖ్యం ఏమిటంటే మిరపకాయలు కోసి వేయకూడదు. పచ్చిమిరపకాయల్ని చిదిపివెయ్యాలి.
ఆ కారం, ఈ ఉప్పుగల్లు, పులుపూ తగుల్తుంటే స్వర్గానికి బెత్తెడు ఎడంగా వుంటుంది. ఏ పులిహోరకైనా కమ్మటి జీడిపప్పులు ముద్దముద్దకీ మూడోనాలుగో తగలాలి. లేనివాళ్ళు వేరుశనగపప్పు వేసుకోవచ్చు.
కొంచెం అటూ ఇటూ దబ్బకాయ పులిహోర కూడా నిమ్మకాయ పులిహోర లాంటిదే. ఇక్కడ నిమ్మకాయ వాడితే అక్కడ దబ్బకాయ వాడతాం. పోపులో నువ్వుగుండ వేసి కలిపితే నువ్వుపులిహోర. ఇది కమ్మగా ఉంటుంది. ఎంతైనా తేలిగ్గా తొనొచ్చు. అన్నానికి కొబ్బరికోరు కలిపితే కొబ్బరి పులిహోర. ఇది చాలా కమ్మగా ఉంటుంది. మామిడికాయలు తురిమి ఆ కోరు కలిపితే మామిడి పులిహోర".
ఊ... అనడానికి కూడా ఊపిరిలేక నీరసించిపోయింది చిట్టితల్లి. ఇదేం మానవుడు. చూడడానికి అందంగా ఉన్నా బుద్ధులు మాత్రం పులిహోర బుద్ధులు.
we need print book