-
-
అద్భుత లోకంలో ఆలీసు
Alice in Wonderland in Telugu
Author: Manchi Pustakam
Publisher: Manchi Pustakam
Pages: 120Language: Telugu
ప్రపంచ బాల సాహిత్యంలో ఎన్నదగిన పుస్తకాలలో 'అద్భుత లోకంలో ఆలీసు' ఒకటి. లూయిస్ కారోల్ 'Alice’s Adventures in Wonderland' ని 1865లో రాశాడు. ఇది ప్రచురితమైన 150 సంవత్సరాల సంబరాల సందర్భంగా దీని తెలుగు అనువాదాన్ని ప్రచురిస్తున్నాం. ఇప్పటివరకు ఇది 150కి పైగా భాషలలోకి అనువాదమయ్యింది. భారత దేశంలో హిందీ, మరాఠీ, కొంకణి, కన్నడ, ఒడియా, బెంగాలి, మలయాళం, అస్సామీ, ఉర్దూ, తమిళం, పంజాబీ భాషలలోకి అనువాదమయ్యింది.
లూయిస్ కారోల్ అసలు పేరు చార్లెస్ లట్విడ్జ్ డాడ్స్న్. పదకొండుమంది సంతానంలో అతను పెద్దవాడు. కుటుంబ వినోదం కోసం చిన్నతనంలోనే సొంతంగా పత్రికలను తయారు చేసేవాడు. తను చదువుకున్న కళాశాలలోనే గణిత ఉపన్యాసకుడిగా 1855 నుంచి 1881 వరకు పనిచేశాడు. అతడు సిగ్గరే కాకుండా నత్తి కూడా ఉండేది. పిల్లలకు కథలు చెప్పడం అంటే ఎంతో ఇష్టం.
ఆలీసు కథానాయికగా 'Through the Looking Glass' అన్న మరో పుస్తకాన్ని 1872లో రాశాడు. ఇవేకాక లూయిస్ మరికొన్ని పుస్తకాలు రాశాడు. అతడు మంచి ఫోటోగ్రాఫర్ కూడా. ఈ పుస్తకానికి సర్ జాన్ టెన్నియల్ వేసిన బొమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కథని నాటకంగానూ, సినిమాగానూ కూడ మలిచారు. ఈ పుస్తకం ఆనాటికీ, ఈనాటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది.
