-
-
ఆలయ గోపురం
Alaya Gopuram
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 683Language: Telugu
ఎన్నో పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, మరెన్నో పురాతన ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు అత్యాధునిక దిన, వార, పక్ష, మాస పత్రికలలోను ఆధ్యాతిక అంశాలను పరిశీలించి, పరిశోధించి వినూత్నంగా రూపొందించిన భక్తి కుసుమం "ఆలయ గోపురం".
* * *
ఏ సమయంలో ఏ పని, ఏ దిక్కుగా ప్రారంభించాలో తెలియజేస్తారా?
ఉదయం పూట కార్యాన్ని ప్రారంభింపదలిస్తే తూర్పు వైపు, అదే సాయంత్రము వైపు కార్యాన్ని ఉత్తరదిశగా ప్రారంభించాలి. అప్పుడు అది విజయవంతమవుతుంది.
'ఓం'కారం శక్తి గురించి చెప్తారా?
ఋగ్వేదములోని 'అ'నూ, యజుర్వేదములోని 'ఉ'నీ, సామవేదంలోని 'మ్'నూ కలిపితే 'ఓం'కారం ఉద్భవించింది. 'ఓం' అని తలచుకున్నంతనే వేదాలను చదివిన ఫలితము సిద్ధిస్తుంది. అందుకే ఏ నామానికైనా మనం ముందుగా 'ఓం' అని చేర్చి పఠిస్తాము.
ఈ ప్రపంచంలో అన్నింటికంటే కష్ట సాధ్యమైనది, తేలికైనది ఏది?
అన్నింటికన్నా కష్టమైనది ధర్మంగా ఉండటం. తేలికైనది అధర్మంగా ఉండటం. అలాగే అతి కష్టమైనది ధనం సంపాదించటం, తేలికయినది కూడా ధనాన్ని సంపాదించటమే.
ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినవి....
మాట్లాడే ముందు ముందూ, వెనుకా చూసుకోవాలి. పక్కవారిని మందలించే ముందూ, విమర్శించేముందూ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. దైవానికి పూజ చేయటమే పుణ్యం కాదు, క్షమించే తత్వం కూడా ఉండాలి. బియ్యపు గింజలపై మీ పేరు అయిపోవటానికి ముందే ఎవ్వరికి ఇవ్వాల్సిందీ, చెయ్యాల్సిందీ పూర్తిచెయ్యాలి.
