• Aladri
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఆలాద్రి

  Aladri

  Publisher: Chinuku Prachurana

  Pages: 136
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 31 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

''నా బాధ్యతలు గురించి నేను ఇంకోరితో చెప్పించుకునే రకం కాదు. నాకు బాధ్యతలు మీరు చెప్పనవసరం లేదు'' కొద్దిగా కఠినంగానే చెప్పింది.

''ఛ...ఛ... ఈ సమాజం ఇలా ఇలాగే ఎందుకు వుందో నేను అనుకున్నది కరెక్ట్‌నన్నమాట''

''ఏమనుకున్నారు''

''నీలాంటి వాళ్ళ వల్లే'' అన్నాడు.

''ఏమాట్లాడుతున్నారు మీరు'' అంది కళ్ళు కొద్దిగా పెద్దవి చేసి.

''నిజమే మాట్లాడుతున్నాను. ఎవరికి వారు నాకెందుకు నాకెందుకు అనుకోవడం వల్లే ఈ సమాజం ఇలా ఆఘోరించింది. పోలీసులు చాతకాని వాళ్ళు చాతకాని వాళ్ళు అని నొక్కి నీ వ్యాసంలో రాశావే. మరి నువ్వుచేస్తున్న దేమిటి? నిజమే ఒప్పుకుందాం పోలీసులు చాతకాని వాళ్ళే. మరి సమాజం ఏం చేస్తోంది. ఒకడు చచ్చినా పోలీసు కావాలి. ఒకడు బతికిన పోలీసు కావాలి. మీకు మాత్రం ఏమాత్రం సంబంధం లేనట్టుగా, మొత్తం పోలీసులే ఉద్దరించాలన్నట్టుగా మాట్లాడుతారు. పోలీసులకు పెళ్ళాలుంటారు. బాధ్యతులు వుంటాయి. పిల్లలు సంసారం ఒకటి వుంటుంది. వాడికి దాని గురించి ఆలోచించే టైము వుండక సతమతమవుతుంటాడు అన్న విషయం ఒక్కరంటే ఒక్కరు ఆలోచించరు. ఎంత సేపు లంచాలు తింటారు. అబద్దాలు చెపుతారు అంటూ ఏడవడమే కాని. సమాజంలోని మనుషులుగా మన బాధ్యత ఉన్నదన్న విషయం అందరూ మర్చిపోయారు. దీనికి నువ్వు మాత్రం అతీతం కాదు సౌందర్య. నీలాంటి ఓ అమ్మాయి రోడ్డుమీద నడుచుకుంటూ వెడుతుంటే ఎవడో పోకిరి వెధవ వెంటబడితే రోడ్డు మీద నడుస్తున్న నలుగురు సినిమా చూసినట్టు చూసి వినోదిస్తారే తప్ప ఒక్కడు కూడా ముందుకు వచ్చి అమ్మాయికి ఆసరగా నిలబడడు. ఎందుకంటే వాడు నాకెందుకు అనుకుంటాడు. మా అమ్మాయి. కాదనుకుంటాడు. అమ్మాయి మీద యాసిడ్‌ పోసినా, అమ్మాయిని నానా రకాలుగా ఏడిపించినా మనం కిమ్మనకుండా నోర్మూసుకుని చూస్తు వెళ్ళిపోతాం ఎందుకు. దానికి పోలీసులు వచ్చి ఆపాలా? వాడిని పట్టుకుని శిక్షించాలా? మరి మీరేం చేస్తున్నట్టు. పాపం అమ్మాయిని ఏడిపించినవాడిని పట్టుకుని ఏంట్రా?వొళ్ళు దురదగా వుందా? వేషాలు వేస్తున్నవా? నాలుగు దులపమంటావా? అని నలుగురు కలిసి నిలదీస్తే అమ్మాయికి ఏమి కాదుగా. మనకు జరిగినప్పుడు మాత్రం అందరూ రావాలి. సాయం చేయాలి. ఎదుటి వాళ్ళకి జరిగితే మాత్రం మనము స్పందించం. ఎవడికి వాడు ఇలా అనుకోబట్టే అమ్మాయిలమీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, మానభంగాలు, మర్డర్లు జరుగుతున్నాయి. ఈ సమాజం మారనంతవరకు ఇలాంటివి ఎవరు ఆపలేరు. ఎంత మంది పోలీసులు వచ్చినా వీటిని ఆపలేరు. ఎంతసేపు అవినీతి పోలీసుల గురించే మాట్లాడుతారు. కాని నిజాయితి వున్న పోలీసులను మాత్రం కనీసం పట్టించుకోరు. ఏం మనుషులండీ? ఛీ...ఛీ.. చేతిలో కలం వుందని రాయడం వచ్చని పోలీసులు మీద తేరగా రాసేస్తారు'' దుమ్ము దులిపినట్టే అవేశంగా మాట్లాడాడు పరమేశ్వర్‌.

అతని మాటలని అలా నివ్వేరపోయి చూస్తుండిపోయింది.

చుట్టుపక్కన వున్న వాళ్ళు ఇతని మాటలు వింటున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Aladri