• Ala Singapuramlo
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అలా సింగపురంలో....

    Ala Singapuramlo

    Pages: 132
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాఠకదేవుళ్ళకి నమస్కారం

'తెలుగు కథ' సుసంపన్నం కావాలంటే పుంఖానుపుంఖాలుగా కథలు రావాలి. రచయితల / రచయిత్రుల సంఖ్య పెరగాలి. ఒకప్పుడు చాలా పత్రికలుండేవి. వాటిలో మూడొంతులు ఇప్పుడు మూతబడ్డాయి. అయినా, ఆ లోటుని ఆన్‌లైన్ పత్రికలు, ఫేస్‌బుక్కూ కొంతవరకూ భర్తీ చేస్తున్నాయి.

రాశి, వాసి సంగతి పక్కన బెడితే గొప్ప విషయం ఏమంటే, రచయితల కంటే రచయిత్రులది పైచేయి కావడం. చాలా మంచి పరిణామం ఇది.

మగవారి దృష్టిలో (రచయితల) (కథ) యొక్క వస్తువు, రూపం వేరుగా ఉంటుంది. రచయిత్రులయితే ఎక్కువగా మానవసంబంధాల మీదే దృష్టి పెడతారు. పోస్టాఫీసుకి వెళ్ళి బిల్లు కట్టడమో, పనిమనుషుల చేత పనులు చేయించడమో, విహారయాత్రకో, జలపాతం దర్శించడమో, దేవుడ్ని స్నేహితుడిగా భావించడమో, ఆఖరికి మన సంస్కృతిని మనం ఎంతగా తలకెత్తుకోవాలో తెలుసుకోవడం కూడా 'కథావస్తువు'లవుతాయని 'అలా.. సింగపురంలో...' పుస్తకంలో మనం చూస్తాం. తన పరిసరాల మధ్య, తనదైన అనుభవాల్ని రాధిక మంగిపూడి కథలుగా మలిచారు. ఇది తొలి పుస్తకం. ఎంత పెద్ద పయనమైనా మొదలయ్యేది మొదటి అడుగుతోనే!

- భువనచంద్ర

కథలన్నీ జీవిత ప్రతిబింబాలే. జీవితాలన్నీ పాఠాలే. మనకు ఎదురయ్యే నిత్యానుభవాలన్నీ మనకు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అన్నీ సూటిగా, స్పష్టంగా ఉండకపోయినా మన వివేకాన్ని బట్టి, మన అవగాహననిబట్టి వాటిని మనము గ్రహించగలుగుతాము అనేది మాత్రం వాస్తవం. నా కథలన్నీ, అటువంటి అనుభవాల సారంగా మలచాలనీ; కథ చదువుతున్నప్పుడు హాయిగా నవ్వించి చివరలో కథా సారాంశం వైపుగా పాఠకుల ఆలోచన ప్రసరింప జేయాలనే సదుద్దేశంతో వ్రాసినవే. సింగపూర్ ప్రవాసాంధ్రుల కథారచనలలో మొదటిసారిగా పుస్తకరూపంలో ప్రచురితమౌతున్న ఈ 'అలా.. సింగపురంలో పుస్తకానికి నా కలం ప్రాణం పోయడం చాలా ఆనందంగా ఉంది.

ఈ కథాసంపుటిలో కొన్ని నా సింగపూర్ ప్రవాసంలోని వాస్తవానుభవాల కథనాలను, కొన్ని కల్పిత కథలను జోడించడం జరిగింది. కథా ఇతివృత్తాలన్నీ సాధారణ సామాజికాంశాలు. అందరికీ నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనల నుండే కథలను రూపొందించే ప్రయత్నం చేశాను. ఈ కథల ముగింపులో ఎక్కడా సూటిగా సూచించే నీతివాక్యాలు లేవు. విషయం వరకే ఉండేలా, వివరణ పాఠకుల ఆలోచనకు విడిచి పెట్టేలా ఉండాలనేది నా ఉద్దేశ్యం.

- రాధిక మంగిపూడి

Preview download free pdf of this Telugu book is available at Ala Singapuramlo