-
-
అక్షరాణువులు
Aksharanuvulu
Author: Sabbani Laxminarayana
Publisher: Sarat Sahiti Kalasravanti
Pages: 33Language: Telugu
"సబ్బని / నానోలు / అక్షరాణువులు / భావ విస్ఫోటనాలు".
సాహిత్య సేవ చేస్తున్న కవిమిత్రులు , స్నేహశీలి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణగారు రచించిన ఈ నానోల సంపుటిలోని నానోలు చూడగానే "కవిత్వమంటే ... అక్షరాణువులతో భావ విస్ఫోటనం చేయడమే" అని నేను అప్పట్లో ఒక ఏకవాక్యంలో వ్రాసిన విషయం స్ఫురణకు వచ్చింది. అల్పమైన అక్షరాలతో అనల్పమైన భావాలను పండించాలంటే భాషమీద , భావాలమీద ఎంతో పట్టు ఉండాలి. అలా పట్టు సాధించి నాలుగు పంక్తులలో ఇమిడిపోయే భావాలను నాలుగంటే నాలుగు పదాలలో వ్యక్తీకరించడం సామాన్యమైన విషయం కాదు. ఓ దశాబ్దకాలం క్రితం సత్కవిమిత్రులు శ్రీ ఈగ హనుమాన్ గారు ప్రవేశపెట్టిన ఈ నానో ప్రక్రియలో ఎంతోమంది కవులు నానోలు సృజించి పుస్తకాల రూపంలో తెలుగు ప్రజలకు అందించారు. అదే క్రమంలో వస్తున్న మరో నానోల సంపుటి " అక్షరాణువులు " .
కన్నీళ్లు /సిరా/ కవిత్వం/ విషాదం ....
విషాదాంతమైన కవిత్వాన్ని రాయాలంటే కన్నీళ్ళే సిరాగా వాడాలంటూ చదువరికి కంటనీరు పెట్టించే నానో చూసినా
దీక్ష / పట్టుదల / పథం / విజయం
పట్టుదల దీక్షతోనే విజయపథాన్ని చేరుకోగలమని స్ఫూర్తిని నింపే నానో చూసినా
నేను/ ఆమె/ భూమి /ఆకాశం
నేను మిన్ను అయినా ఆమె మిన్ను అనే భావాన్ని చెప్తూనే ... మనం ఎప్పుడూ కలవక పోయినా కలిసేది క్షితిజం దగ్గరే అనే భావాన్ని కూడా చూపించే నానో చూసినా
కవిత / సూక్ష్మం / భావం / అనంతం
నానో స్వరూపాన్ని చూపే ఈ నానో చూసినా
వస్తువు ఏదైనా, తీసుకున్న అంశం ఏదైనా దానిని ప్రతిభావంతమైన నానోగా మలిచే సామర్థ్యం ఉన్న కవి శ్రీ సబ్బని అని చెప్పేయవచ్చు .
"సబ్బని /నానోలు /అక్షరాణువులు /భావ విస్ఫోటనాలు "
శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ గారు మరిన్ని నానోలు వ్రాయాలని, పాఠకులకు అందించాలని మనసారా కోరుకుంటూ...
- ఆర్.వి.ఎస్.ఎస్. శ్రీనివాస్

- ₹14.4
- ₹72
- ₹60
- ₹60
- ₹60
- ₹36