-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
అక్షరాంజలి (free)
Aksharanjali - free
Author: Anamakudu
Publisher: Aparajita Publications
Pages: 60Language: Telugu
కొందరు, కొరకరాని కొయ్యలా కనబడే శాస్త్రవిజ్ఞానాన్ని సూటిగా మన మస్తిష్కాలలోకి చొప్పిస్తారు. ఇంకొందరు, అందరికీ అందని, అర్థంకాని తత్త్వశాస్త్ర జ్ఞానాన్ని చాలా తేలికైన భాషలో మనతో ఆపోసన పట్టిస్తారు. మరికొందరు, తమ కవిత్వంతో మన హృదయాలను సరికొత్త భావనా ప్రపంచంలోనికి పరుగులు పెట్టిస్తారు. అయితే, ఈ విద్యలన్నింటినీ ఒడిసిపట్టి, ఆ జ్ఞానాన్ని అక్షరాలతో కలియగట్టి, దానిని ఆనందపు పేటికలో అందంగా పెట్టి మనకు అందించగలిగేవారు చాలా అరుదుగా ఉంటారు. చెదురు మదురుగా ఎక్కడో ఒకచోట ఇటువంటివారు మనకు తారసపడినా మనం గుర్తించలేం. కారణం.. వాళ్లు తమ పేరును ఎలుగెత్తి చాటుకోకపోవడం. అనామకంగా ఉంటూనే రమణీయకమైన రచనలు చేసుకుంటూ పోవడం. అటువంటి అపురూప రచయితలలో ఒకరు.. ఈ పుస్తక రచయిత అయిన “అనామకుడు”. ఎ.ఎస్.రామశాస్త్రి అనే ఈ అనామక నామధేయుడు ఇంతవరకూ 50కి పైగా కథలు, రెండు నవలికలు, ఒక రేడియో నాటకం వ్రాశారు. ఇందులో బహుమతులు పొందినవి, ముళ్లపూడి వెంకటరమణ గారు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి వంటి సుప్రసిద్ధుల ప్రశంసలు అందుకున్నవీ ఎన్నో ఉన్నాయి.
ఇక “అక్షరాంజలి” అనే ఈ పుస్తకాన్ని తెరిస్తే.. ఆత్మబిలంలోనికి మార్గం కనపడుతుంది. ఆ దారిలో భౌతికశాస్త్ర నియమాలు, పదార్థ విజ్ఞాన రహస్యాలు, సృష్టిక్రమంలోని వైచిత్రీ ఇలా ఎన్నో వింతలు కనబడతాయి. “ఓ భగవంతుడా! అసలు ఈ సృష్టిని ఇలా ఎలా చేశావ్?”, “నువ్వు మమ్మల్ని పుట్టించావా? లేక మేమే నిన్ను పుట్టించుకున్నామా?” అనే ప్రశ్నలు ఎదురవుతాయి. అహంకార, స్వార్థాలను లాగివేసి, ధైర్యజిజ్ఞాసలను మా జీవితాల నిండా నింపమనే ప్రార్థనలు వినబడతాయి. “నిన్ను మించిన దర్శకుడెక్కడ ఉన్నాడు స్వామీ” అంటూ భగవంతునికి కూడా పరవశం కలిగించే ప్రశంసలు మురిపిస్తాయి. సృష్టికర్త వినోద. విలాసాలు చూడడానికి మనోనేత్రాలు తెరచుకుంటాయి. ఉపనిషత్తుల సారం జలపాతంలా మీదకు దుమికి మనలో ఇంకిపోతుంది. అరవై పద్యాల ఈ పుస్తకం పూర్తయ్యేసరికి మన మనస్సు ఆనందంతో నిండిపోతుంది.
ఈ పద్యాలు ఆత్రేయగారి పాటలలాంటివి. తేలికైన పదాల దొంతరలు బరువైన భావాలను మోసుకుంటూ వెళిపోతుంటాయి. ఈ పద్యాలన్నీ హృద్యాలే. అరవై పుటల ఈ పుస్తకం అరగంటలో పూర్తయిపోతుంది. ఇంకొక అరవైసార్లు చదువుకున్నా పట్టరాని ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. ఆనందం వెల కట్టలేనిది కనుక ఈ పుస్తకానికి కూడా విలువకట్టలేదు రచయిత. ఇది మనకు ఉచితంగా లభిస్తున్న ఉచితమైన పుస్తకం.
- కినిగె, ఈ-పుస్తక ప్రచురణకర్తలు

- ₹108
- FREE
- ₹108
- ₹450.00
- ₹60
- ₹216