-
-
అక్షరమాల
Aksharamala
Author: Tallapragada Ravi Kumar
Publisher: Self Published on Kinige
Pages: 142Language: Telugu
ఇదొక అరుదైన పుస్తకం. ఇదొక అరుదైన ప్రయత్నం. బహుశా ఏ భాషలోను ఇటువంటి ప్రయత్నం జరిగి ఉండదనీ, వేరొకరెవరూ ఇటువంటి ప్రయత్నం చేసి ఉండరనీ నేననుకుంటున్నాను. మన భాష మాత్రమే, మన వర్ణమాల మాత్రమే ఇటువంటి ప్రయోగానికి అనుకూలమని కూడా విశ్వసిస్తాను.
- పెద్దిభొట్ల సుబ్బరామయ్య
* * *
ఈ చిరు గ్రంథం ఒక కొత్త ప్రయోగం. తెలుగు వర్ణ సమాన్మయంలోని అక్షరాలను తీసుకొని - ఆ అక్షరం ఇచ్చిన స్ఫూర్తితో కథలను అల్లారు. 'అమ్మ' అనే తొలికథలో ఇతర ప్రాణుల యెడల దయ చూపాలని తెలియజేస్తారు. సత్యప్రవర్తన ప్రాధాన్యాన్ని రెండవ కథ 'ఆవు'లో వివరిస్తారు. 'ఉడుత' కథలో సాటివారికి సాయం చేసే తీరు ప్రబోధిస్తారు. 'ఎలుక' అనే కథలో స్నేహసంపద ఔన్నత్యాన్ని వివరిస్తారు. కలసి ఉంటే కలదు సుఖం అనే జీవిత సత్యాన్ని 'ఐకమత్యం' అనే కథ ద్వారా తెలుపుతారు. ఇలా ప్రతీ కథ ఒక సందేశాన్ని తెలియజేస్తూ, ఒక సదుద్దేశ్యంతో జనహితంగా కథారచన సాగింది. భాష సరళంగా, చదివే అలవాటును పెంచేదిగా ఉంది. బాలసాహిత్య నందనవనంలో ఈ గ్రంథం ఒక పారిజాత కుసుమం కాగలదనడంలో సందేహం లేదు.
- వెలగా వెంకటప్పయ్య
గమనిక: "అక్షరమాల" ఈ-బుక్ సైజు 10.6 MB
అక్షరానికో అందమైన కథ – అక్షరమాల(కథలు)
http://teblog.kinige.com/?p=3558