-
-
అక్షరాల చెలిమె
Aksharala Chelime
Author: Aanand Varala
Publisher: Prose Poetry Forum
Pages: 119Language: Telugu
Description
అక్షరాల చెలిమె
నేను
చిన్నప్పటినుండీ మూగవాణ్ణే
మాటలే అప్పుడప్పుడూ
చుట్టం చూపులాగా వచ్చి పాతూవుండేవి
మాటకూ మాటకూ మధ్య
నిశ్శబ్దమేదో తచ్చాడుతూ వుండేది
మనసు ఎన్నో అనుకునేది కలలు గనేది
నిప్పు మీది బూడిదలా
మూగతనం ఎప్పటికప్పుడు కమ్మేసేది
వ్యక్తానికీ అవ్యక్తానికీ మధ్య
మనసు
కెరటానికీ ఇసుకకూ నడుమ నురగలా తేలియాడేది
పలకడానికో మాట్లాడడానికో
గొంతు సమస్త శక్తుల్నీ కూడదీసుకునేది
మాటలేమో గొలుసులా అల్లుకు పోయి
అలకూ అలకూ నడుమ నిశబ్దంలా నిలుచుండి పోయేవి
ఊపిరి సలపక ఉనికి నిలవక
భావాల తూఫాన్లను కళ్లెంతగా పలికేతే మాత్రం
ఎవరికీ పట్టేది కాదు, తెలిసేదీ కాదు
దృశ్యాలు నన్నావరించి
అక్షరాలు నాలో ఇంకిపోయాక
మూగతనం ముసుగు తొలిగింది
భావాలు అక్షరాలుగా రూపాంతరం దాల్చి ఎగిసినప్పుడు గదా
నేను సంభాషించడం మొదలెట్టింది
అక్షరాల చెలిమెలోంచి
నన్ను అందరూ వినడం ఆరంభించింది
Preview download free pdf of this Telugu book is available at Aksharala Chelime
Login to add a comment
Subscribe to latest comments
