-
-
అక్షర బాటసారి సినారె
Akshara Batasari Cinare
Author: Navatelangana Publishing House
Pages: 104Language: Telugu
అభ్యుదయం మానవత్వం మూర్తీభవించిన సాహితీ దిగ్గజం డా. సి. నారాయణరెడ్డి ఇటీవల కన్నుమూశారు. సాహితీవేత్తలలో, ప్రత్యేకించి కవుల్లో అరుదుగా కనిపించే క్రమశిక్షణతో అత్యంత దీక్షతో సాహితీ వ్యవసాయాన్ని తుదికంటా కొనసాగించిన నిత్య కృషీవలుడాయన. అంతేకాదు అధ్యాపకునిగాను, అధికారిగాను కూడ తన ప్రతిభను నిరూపించుకున్న విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. పార్లమెంటులో సైతం అందరు నామినేటెడ్ సభ్యులు మాదిరిగా మౌన ప్రేక్షకునిగా కాక, పలు ప్రజాసమస్యలపై తన వాణిని వినిపించారు. ఆయన బహుముఖ కృషికి తగినట్టుగానే కేవలం సాహిత్య రంగానికి చెందినవారే కాకుండా, ప్రధాని నుండి, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షనేతలు, అధికార, అనధికార ప్రముఖులెందరో సినారె మృతికి సంతాపం ప్రకటించి నివాళులర్పించారు, ఆయనతో తమ అనుభవాలను, అనుబంధాన్ని వ్యక్తం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తికి నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ సమర్పిస్తున్న అక్షరాంజలి ఇది. అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులర్పిస్తూ పలువురు ప్రముఖులు, వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాల సమాహారం ఈ ప్రచురణ.
- నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్

- FREE
- ₹60
- ₹18
- ₹60
- ₹60
- ₹60